Share News

బైక్‌ దొంగలు.. క్షణాల్లో దొరికిపోతారు!

ABN , Publish Date - Jun 03 , 2026 | 01:50 AM

ఇక నుంచి మీ బైక్‌ దొంగతనానికి గురైతే ఎలాంటి ఆందోళన పడాల్సిన అవసరం లేదు. రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా తెచ్చిన సీసీటీవీ360 ప్రోగ్రామ్‌లో భాగంగా బైక్‌ దొంగ ఎక్కడున్నా క్షణాల్లో పోలీసులు పట్టుకుంటారు. ప్రమాదం జరిగినప్పుడు గోల్డెన్‌ అవర్‌లో క్షతగాత్రుడ్ని కాపాడుకునే అవకాశమున్నట్లు.. బైక్‌ దొంగతనానికి గురైన వెంటనే స్థానిక పోలీ్‌సస్టేషన్‌లో ఫిర్యాదు చేస్తే కాపాడుకునే అవకాశం ఉంటుంది. ఎఫ్‌ఐఆర్‌ లేకుండానే సీసీటీవీ360 ద్వారా బైక్‌ దొంగను పట్టుకుంటారు. ఆలస్యమైతే బైక్‌ స్వరూపాన్ని మార్చేసే ప్రమాదముంది కాబట్టి.. త్వరగా ఫిర్యాదు చేస్తే ఫలితం ఉంటుంది. ఈ సీసీటీవీ360 ప్రోగ్రామ్‌లో చిత్తూరు జిల్లా ముందంజలో ఉంది.

బైక్‌ దొంగలు..   క్షణాల్లో దొరికిపోతారు!
చిత్తూరులో గాంధీ విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన మ్యాట్రిక్స్‌ కెమెరా

  • ‘సీసీటీవీ360’ను ప్రారంభించిన రాష్ట్ర ప్రభుత్వం

  • చోరికి గురైన వెంటనే ఫిర్యాదు చేస్తేనే ఫలితం

  • ఎఫ్‌ఐఆర్‌ లేకుండానే దొంగల్ని పట్టుకునే అవకాశం

చిత్తూరు అర్బన్‌, జూన్‌ 2 (ఆంధ్రజ్యోతి): ఇక నుంచి మీ బైక్‌ దొంగతనానికి గురైతే ఎలాంటి ఆందోళన పడాల్సిన అవసరం లేదు. రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా తెచ్చిన సీసీటీవీ360 ప్రోగ్రామ్‌లో భాగంగా బైక్‌ దొంగ ఎక్కడున్నా క్షణాల్లో పోలీసులు పట్టుకుంటారు. ప్రమాదం జరిగినప్పుడు గోల్డెన్‌ అవర్‌లో క్షతగాత్రుడ్ని కాపాడుకునే అవకాశమున్నట్లు.. బైక్‌ దొంగతనానికి గురైన వెంటనే స్థానిక పోలీ్‌సస్టేషన్‌లో ఫిర్యాదు చేస్తే కాపాడుకునే అవకాశం ఉంటుంది. ఎఫ్‌ఐఆర్‌ లేకుండానే సీసీటీవీ360 ద్వారా బైక్‌ దొంగను పట్టుకుంటారు. ఆలస్యమైతే బైక్‌ స్వరూపాన్ని మార్చేసే ప్రమాదముంది కాబట్టి.. త్వరగా ఫిర్యాదు చేస్తే ఫలితం ఉంటుంది. ఈ సీసీటీవీ360 ప్రోగ్రామ్‌లో చిత్తూరు జిల్లా ముందంజలో ఉంది.

అందుకే మన జిల్లాలో పట్టుకోవడం కష్టం..

మన జిల్లా అటు తమిళనాడు, ఇటు కర్ణాటక రాష్ట్రాలకు సరిహద్దున ఉండడంతో బైక్‌ దొంగలు సులువుగా తప్పించుకుంటున్నారు. పోలీసులకూ వాళ్లను పట్టుకోవడం తలకుమించిన భారంగా మారింది. బైక్‌ పోయిందని ఫిర్యాదు చేస్తే కేసు పెట్టేందుకు కూడా వెనుకాడేవారు. ఎందుకంటే కేసు నమోదైన నిర్ణీత కాలంలో బైక్‌ రికవరీ చేసి దొంగల్ని పట్టుకోవాల్సి ఉంటుంది. ఇక నుంచి సీసీటీవీ360 సాంకేతికతతో దొంగల్ని రాష్ట్రంలో ఎక్కడున్నా పట్టుకోవచ్చు.

రాష్ట్రవ్యాప్తంగా సీసీటీవీ360 అనుసంధానం..

ఈ సీసీటీవీ360 సాంకేతికతలో రాష్ట్రంలోని అన్ని కెమెరాలు ఒకే వ్యవస్థకు అనుసంధానమై ఉంటాయి. ఓ కెమెరాలో రికార్డయిన దొంగ ఫొటోను ఆ సాఫ్ట్‌వేర్‌లో అప్లోడ్‌ చేస్తే, అతడు రాష్ట్రంలో ఎక్కడున్నా ఆ ప్రాంతంలోని కెమెరా అతడి కదలికల్ని పట్టేస్తుంది. ఇలా సులువుగా క్షణాల్లో దొంగల్ని పట్టేసేలా సాఫ్ట్‌వేర్‌ను రూపొందించారు. బైక్‌ దొంగల్నే కాకుండా, మహిళలు, చిన్నారులు, వృద్ధుల మిస్సింగ్‌ కేసులోనూ తప్పిపోయిన వారిని గంటల వ్యవధిలోనే గుర్తింవచ్చు. వీటన్నింటికి ఆర్‌టీజీఎస్‌ సేవలు ఎంతో ఉపయోగపడుతుంది. తక్కువ సమయంలోనే ఎక్కువ సమాచారాన్ని సేకరించి కేసులను వేగంగా ఛేదించవచ్చు.

ఎలా ఫిర్యాదు చేయాలంటే..

బైక్‌, కారు, లేదా ఏ ఇతర వాహనమైనా దొంగతనానికి గురైన సమయం, చివరిసారిగా ఎక్కడ ఉంచారు.. వంటి వివరాలను సమీప పోలీసు స్టేషనులో సమాచారమివ్వాలి. తాత్కాలిక ప్రాతిపదికన ఎలాంటి ఎఫ్‌ఐఆర్‌ లేకుండానే పోలీసులు సీసీటీవీ 360 ద్వారా సంబంధిత వాహనాల వివరాలను రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నిఘా వ్యవస్థకు అనుసంధానం చేస్తారు. దీంతో దొంగతనానికి గురైన వాహనం ఎక్కడుందో కెమెరాలు గుర్తిస్తాయి. ఆధునిక సాంకేతిక వ్యవస్థల ద్వారా వాహనాల దొంగలను పట్టుకునేందుకు ఈ మ్యాట్రిక్స్‌ కెమెరాలు కీలకంగా పనిచేయనున్నాయి.

జిల్లాలోని ప్రధాన ప్రాంతాల్లో కెమెరాలు

రాష్ట్రవ్యాప్తంగా రోజు రోజుకూ పెరిగిపోతున్న వాహనాల దొంగతనాల కేసులను ఛేదించడం కోసం పోలీసుశాఖ ఆధునిక, సాంకేతిక వ్యవస్థలను వినియోగిస్తోంది. ముఖ్యంగా ప్రధాన కూడళ్లు, ప్రధాన రహదారులు, జాతీయ రహదారులు, పట్టణ ప్రాంతాలు, టోల్‌ప్లాజాల వద్ద అత్యాధునిక మ్యాట్రిక్స్‌ కెమెరాలు, రియల్‌ టైం మానిటరింగ్‌ వ్యవస్థల ద్వారా అనుమానాస్పద వాహనాల కదలికలను గుర్తిస్తారు. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా కీలక ప్రాంతాల్లో సీసీ కెమెరాలు, ఏఎన్‌పీఆర్‌ కెమెరాలను ఏర్పాటు చేశారు.

పార్కింగ్‌ సమయంలో అప్రమత్తత అవసరం

ప్రజలు తమ వాహనాల భద్రతా విషయంలో నిర్లక్ష ్యం చేయకూడదు. వాహనాలను పార్క్‌ చేసే సమయంలో తప్పనిసరిగా స్టీరింగ్‌ లాక్‌, వీల్‌ లాక్‌, ఇతర భద్రతా పరికరాలను వినియోగించాలని పోలీసులు సూచిస్తున్నారు. రాత్రి సమయాల్లో నిర్మానుష్య ప్రాంతాల్లో వాహనాలను నిలపకూడదు. పార్కింగ్‌ చేసే ప్రాంతాల్లో సీసీ కె మెరాలు ఉన్నాయో లేవో పరిశీలించుకోవాలి. అలాగే అనుమానాస్పద వ్యక్తులు లేదా నెంబరు ప్లేట్‌ లేకుండా వాహనాలు కనిపించినప్పుడు పోలీసులకు సమాచారం ఇవ్వాలి.

కేసుల ఛేదనలో సీసీటీవీ360 కీలకం

జిల్లా ప్రజల భద్రత కోసం పోలీసు శాఖ కట్టుబడి ఉంది. ఏ సమస్య వచ్చినా ప్రజలు భయపడకుండా పోలీసు స్టేషన్లలో ఫిర్యాదు చేయాలి. ఈ సీసీటీవీ360 సాంకేతికతో ఇప్పటికే కీలక కేసుల్ని ఛేదించాం. ప్రజల ఫిర్యాదుతో దీన్ని మరింత విస్తృతం చేస్తాం.

- తుషార్‌ డూడీ, చిత్తూరు ఎస్పీ

Updated Date - Jun 03 , 2026 | 01:51 AM