Share News

వైసీపీకి బిగ్‌ షాక్‌

ABN , Publish Date - Oct 30 , 2026 | 01:20 AM

ఆమె వైసీపీ తరపున జడ్పీటీసీ బరిలో దిగేందుకు నామినేషన్‌ వేశారు... పార్టీ గుర్తించి బీ-ఫామ్‌ కూడా ఇచ్చింది. గురువారం మధ్యాహ్నం వరకు వైసీపీ తరపున ప్రచారం కూడా చేశారు

వైసీపీకి బిగ్‌ షాక్‌
ఎమ్మెల్యే విజయశ్రీ, గంగాప్రసాద్‌, వాకాటి సమక్షంలో టీడీపీ కండువా కప్పుకున్న జడ్పీటీసీ అభ్యర్థి గాయత్రి దేవి రెడ్డి, మునస్వామి నాయుడు, గోపిరెడ్డి

టీడీపీలోకి వైసీపీ జడ్పీటీసీ అభ్యర్థి

.దొరవారిసత్రం/సూళ్లూరుపేట, అక్టోబరు 29 (ఆంధ్రజ్యోతి):ఆమె వైసీపీ తరపున జడ్పీటీసీ బరిలో దిగేందుకు నామినేషన్‌ వేశారు... పార్టీ గుర్తించి బీ-ఫామ్‌ కూడా ఇచ్చింది. గురువారం మధ్యాహ్నం వరకు వైసీపీ తరపున ప్రచారం కూడా చేశారు.సాయంత్రం పసుపు కండువా వేసుకుని టీడీపీలో చేరిపోయారు. ఆమెతో పాటు మరో ఇద్దరూ వైసీపీ నాయకులు కూడా టీడీపీలో చేరడంతో వైసీపీకి బిగ్‌షాక్‌ తగిలింది.దొరవారిసత్రం వైసీపీ జడ్పీటీసీ అభ్యర్థి కామిరెడ్డి గాయత్రిదేవి రెడ్డి, ఆ పార్టీకి చెందిన కీలక నాయకుడు మునస్వామి నాయుడు, గోపిరెడ్డి గురువారం ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ, కొండేపాటి గంగాప్రసాద్‌, మాజీ ఎమ్మెల్సీ వాకాటి నారాయణ రెడ్డి సమక్షంలో టీడీపీలో చేరారు.నామినేషన్‌ ఆమోదం పొందాక జడ్పీటీసీ అభ్యర్థి టీడీపీలోకి వెళ్లడంతో వైసీపీకి కోలుకోలేని ఎదురుదెబ్బ తగిలింది. సీఎం చంద్రబాబు విజన్‌కు ఆకర్షితులై టీడీపీలో చేరామని గాయత్రి దేవి రెడ్డి, మునస్వామి నాయుడు ఈ సందర్భంగా తెలిపారు. గతంలో సీఎంగా ఉన్న జగన్‌ టీడీపీ అభ్యర్థులను నామినేషన్లను కూడా వేయనీకుండా ఆరాచకాలు చేశారని.. అదే ఇప్పుడున్న సీఎం చంద్రబాబు ఎన్నికలు ప్రజాస్వామ్య బద్ధంగా జరిపిస్తున్నారని తెలిపారు.తమ మండలం..తమ గ్రామం అభివృద్ధి టీడీపీతోనే సాధ్యమవుతుందని భావించి పార్టీలో చేరామన్నారు. ఈ రోజు నుంచే టీడీపీ అభ్యర్థుల విజయానికి ప్రచారం చేస్తామన్నారు.

Updated Date - Oct 30 , 2026 | 01:20 AM