Share News

భానుడి ఉగ్రరూపం

ABN , Publish Date - May 22 , 2026 | 01:43 AM

వాతావరణ శాఖ ముందే హెచ్చరించినట్లు సూర్యుడు నిజంగానే నిప్పులు చెరిగాడు. భానుడి భగభగలతో గురువారం తిరుపతి జిల్లా నిప్పుల కొలిమిలా మారింది. తీవ్రంగా వడగాల్పులు వీచడంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరయ్యారు.

భానుడి ఉగ్రరూపం

ఉక్కిరిబిక్కిరైన ప్రజానీకం

తిరుపతి(కలెక్టరేట్‌), మే 21(ఆంధ్రజ్యోతి) : వాతావరణ శాఖ ముందే హెచ్చరించినట్లు సూర్యుడు నిజంగానే నిప్పులు చెరిగాడు. భానుడి భగభగలతో గురువారం తిరుపతి జిల్లా నిప్పుల కొలిమిలా మారింది. తీవ్రంగా వడగాల్పులు వీచడంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరయ్యారు.ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలు దాటిపోయాయి.ఇంకో వారం పాటు 46 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం వుందని రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ ప్రకటించింది. కాగా గురువారం సాయంత్రం 3గంటల తరువాత జిల్లాలో పలుచోట్ల మబ్బులు కమ్ముకున్నాయి. పిచ్చాటూరు, నారాయణవనం, నాగలాపురం, ఆర్‌సీపురం తదితర ప్రాంతాల్లో వర్షం పడడంతో జనం కాస్త ఉపశమనం పొందారు. తొట్టంబేడులో 45.1డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా , డీవీసత్రంలో 44.5 డిగ్రీలు, బుచ్చినాయుడుకండ్రిగలో 44.3, పిచ్చాటూరులో 44.1, సత్యవేడు, తడ మండలాల్లో 43.6, ఆర్‌సీపురంలో 43.5, డక్కిలిలో 43.3, పెళ్లకూరులో 43.1, కేవీబీపురం, నాగలాపురం, నారాయణవనం, వెంకటగిరి, పుత్తూరు మండలాల్లో 42.9, రేణిగుంటలో 42.8, నాయుడుపేటలో 42.7, ఓజిలి, తిరుపతి రూరల్‌ మండలాల్లో 42.6, శ్రీకాళహస్తి, ఏర్పేడు మండలాల్లో 42.4, బాలాయపల్లె, చంద్రగిరి, వడమాలపేట, వరదయ్యపాళెం మండలాల్లో 42.3, సూళ్ళూరుపేటలో 42.2, తిరుపతి అర్బన్‌లో 41.8, పెనగలూరులో 41.7, చిట్టమూరులో 41.6, చిట్వేలు, కోడూరు, ఓబులవారిపల్లె, వాకాడు మండలాల్లో 41.1, పాకాలలో 40.8 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

Updated Date - May 22 , 2026 | 01:44 AM