భానుడి భగభగ
ABN , Publish Date - Apr 02 , 2026 | 02:13 AM
భానుడు భగభగలకు బుధవారం ప్రజలు అవస్థలకు గురయ్యారు. అత్యధికంగా శ్రీరంగరాజపురం మండలంలో 38.4, అత్యల్పంగా బైరెడ్డిపల్లె, వి.కోట మండలాల్లో 33.8 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
చిత్తూరు కలెక్టరేట్, ఏప్రిల్ 1 (ఆంధ్రజ్యోతి): భానుడు భగభగలకు బుధవారం ప్రజలు అవస్థలకు గురయ్యారు. అత్యధికంగా శ్రీరంగరాజపురం మండలంలో 38.4, అత్యల్పంగా బైరెడ్డిపల్లె, వి.కోట మండలాల్లో 33.8 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మండలాల వారీగా నిండ్రలో 38.3, తవణంపల్లెలో 37.7, చిత్తూరు అర్బన్, చిత్తూరు రూరల్, గుడిపాలలో 37.0, బంగారుపాళ్యంలో 36.7, గంగాధరనెల్లూరులో 36.6, నగరి, విజయపురంలో 36.5, గంగవరం, ఐరాల, పాలసముద్రం, పెనుమూరు, రామకుప్పం, యాదమరిలో 36.3, పలమనేరులో 36.2, పులిచెర్ల, వెదురుకుప్పంలో 36.1, కార్వేటినగరం, పెద్దపంజాణిలో 35.4, కుప్పం, శాంతిపురంలో 35.2, గుడుపల్లెలో 35.0, పూతలపట్టులో 34.6 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.