వారణాసి యాత్ర ప్రారంభం
ABN , Publish Date - Oct 01 , 2026 | 02:00 AM
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాతికేళ్ళ ప్రజాజీవితాన్ని పూర్తి చేసుకున్న సందర్భాన్ని పురస్కరించుకుని టీఎన్‌ఎ్‌సఎ్‌ఫ ఆధ్వర్యంలో బుధవారం తిరుపతి నుంచి వారణాసికి సేవా సంకల్ప యాత్ర మొదలైంది.అందులో భాగంగా నగరంలోని అలిపిరి నుంచీ పాతికమంది బైక్ రైడర్లు చేపట్టిన బైక్ యాత్రను రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ప్రారంభించారు.
తిరుపతి, సెప్టెంబరు 30 (ఆంధ్రజ్యోతి):ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాతికేళ్ళ ప్రజాజీవితాన్ని పూర్తి చేసుకున్న సందర్భాన్ని పురస్కరించుకుని టీఎన్‌ఎ్‌సఎ్‌ఫ ఆధ్వర్యంలో బుధవారం తిరుపతి నుంచి వారణాసికి సేవా సంకల్ప యాత్ర మొదలైంది.అందులో భాగంగా నగరంలోని అలిపిరి నుంచీ పాతికమంది బైక్ రైడర్లు చేపట్టిన బైక్ యాత్రను రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ప్రారంభించారు. ఈ యాత్ర మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల మీదుగా ఎనిమిది రోజుల పాటు కొనసాగి అక్టోబరు 8న వారణాసి చేరుకుంటుందన్నారు. ఆయా రాష్ట్రాల్లో ఈ యాత్రకు బీజేపీ నాయకత్వం స్వాగతం పలుకుతుందన్నారు.తిరుపతి పార్లమెంటు టీడీపీ అధ్యక్షురాలు పనబాక లక్ష్మి,ఎమ్మెల్యేలు అరణి శ్రీనివాసులు, నెలవల విజయశ్రీ, ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్, ఎస్వీబీసీ ఛైర్మన్ శ్రీధర్ వర్మ, యాదవ కార్పొరేషన్ ఛైర్మన్ నరసింహ యాదవ్, ఏపీ గ్రీనరీ అండ్ బ్యూటిఫికేషన్ ఛైర్‌పర్సన్ సుగుణమ్మ, నాయీబ్రాహ్మణ కార్పొరేషన్ ఛైర్మన్ రుద్రకోటి సదాశివం, బెస్త కార్పొరేషన్ ఛైర్మన్ శ్రీధర్, తిరుపతి, సత్యవేడు టీడీపీ ఇంఛార్జులు జేబీ శ్రీనివాస్, శంకర్‌రెడ్డి, మాజీ డిప్యూటీ మేయర్ ఆర్సీ మునికృష్ణ, టీఎన్‌ఎ్‌సఎ్‌ఫ రాష్ట్ర అధ్యక్షుడు ప్రణవ్, గంగమ్మ ఆలయ ఛైర్మన్ మహేశ్ యాదవ్, నాయకులు ఊట్ల సురేంద్ర నాయుడు, ఆర్పీ శ్రీనివాస్, కంకణాల రజనీకాంత్ నాయుడు, సుబ్బు యాదవ్,దంపూరి భాస్కర్, హేమంత్ రాయల్ పాల్గొని బైక్ రైడర్లకు శుభాకాంక్షలు తెలిపారు.