Share News

తగ్గిన అరటి ధరలు

ABN , Publish Date - Sep 19 , 2026 | 01:55 AM

మార్కెట్లో డిమాండున్నా అరటి ధరలు తగ్గిపోవడంపై రైతులు ఆందోళన చెందుతున్నారు. రైల్వేకోడూరు నియోజకవర్గంలో ఎక్కువగా పండించే గ్రాండ్‌-9 (పచ్చ అరటి) రెండు నెలల క్రితం కిలో రూ. 15 నుంచి రూ. 18 వరకు పలికింది.

తగ్గిన అరటి ధరలు

రైల్వేకోడూరు,సెప్టెంబరు 18(ఆంధ్రజ్యోతి):మార్కెట్లో డిమాండున్నా అరటి ధరలు తగ్గిపోవడంపై రైతులు ఆందోళన చెందుతున్నారు. రైల్వేకోడూరు నియోజకవర్గంలో ఎక్కువగా పండించే గ్రాండ్‌-9 (పచ్చ అరటి) రెండు నెలల క్రితం కిలో రూ. 15 నుంచి రూ. 18 వరకు పలికింది. ధరలు తగ్గుతూ వచ్చి ప్రస్తుతం కిలో రూ. 7 నుంచి 5రూపాయలకు రైతుల నుంచి వ్యాపారులు తీసుకుంటున్నారు.ధరలు బాగుంటాయని పచ్చ అరటిని సాగు చేస్తే మార్కెట్‌లో డిమాండ్‌ ఉన్నప్పటికీ ధరలు తగ్గిపోవడంపై రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.చాలా తోటల్లో అరటి గెలలు పక్వదశకు చేరుకోవడంతో ధరలు లేకున్నా రైతులు వచ్చినంతవరకు తీసుకుని కోతలు చేస్తున్నారు.

Updated Date - Sep 19 , 2026 | 01:55 AM