చిత్తూరుకు చేరుకున్న బ్యాలెట్ పేపర్లు
ABN , Publish Date - Oct 27 , 2026 | 01:56 AM
చిత్తూరు నగరపాలక సంస్థ ఎన్నికల్లో భాగంగా మేయర్, కార్పొరేటర్లకు సంబంధించిన బ్యాలెట్ పేపర్లు సోమవారం కార్పొరేషన్ కార్యాలయానికి చేరాయి. వాటిని పరిశీలించిన ఎన్నికల అధికారులు.. పోలీసు బందోబస్తు మధ్య వీటిని ముద్రణ సంస్థకు పంపారు.
చిత్తూరు అర్బన్, అక్టోబరు 26(ఆంధ్రజ్యోతి): నగరపాలక సంస్థ ఎన్నికల్లో భాగంగా మేయర్, కార్పొరేటర్లకు సంబంధించిన బ్యాలెట్ పేపర్లు సోమవారం కార్పొరేషన్ కార్యాలయానికి చేరాయి. వాటిని పరిశీలించిన ఎన్నికల అధికారులు.. పోలీసు బందోబస్తు మధ్య వీటిని ముద్రణ సంస్థకు పంపారు.
‘పుర’ పోరుకు సిద్ధమవుతున్న బ్యాలెట్ పేపర్లు
చిత్తూరు కలెక్టరేట్: చిత్తూరు కార్పొరేషన్, కుప్పం, పలమనేరు, నగరి మున్సిపల్ ఎన్నికలకు బ్యాలెట్ పేపర్లు సిద్ధమవుతున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికలన్నింటినీ బ్యాలెట్ పద్ధతిలోనే జరపాలని రాష్ట్ర ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయం ప్రకారం జిల్లా యంత్రాంగం చర్యలు చేపట్టింది. గతంలో మున్సిపల్ ఎన్నికలు ఈవీఎంల ద్వారా ఈసారి బ్యాలెట్ పద్ధతి వైపే నిర్వహణకు మొగ్గుచూపారు. మున్సిపల్, ఆ తర్వాత ‘పరిషత్’ ఎన్నికలు ఒక్క విడతలోను.. గ్రామపంచాయతీ ఎన్నికలు మాత్రం మూడు విడతల్లో జరగనున్నాయి. ఈ ఎన్నికలకు సంబంధించి బ్యాలెట్ పెట్టలు మరమ్మతులు పూర్తిచేసి పోలింగ్‌కు సిద్ధం చేశారు. కాగా, నగరి మున్సిపల్ చైర్మన్ ఏకగ్రీవం కావడంతో చిత్తూరు మేయర్, కుప్పం, పలమనేరు మున్సిపల్ చైర్మన్ పదవులకు ఎన్నికలు జరగనున్నాయి. ఇక, 74 వార్డులు ఏకగ్రీవం కావడంతో 94 వార్డుల్లో ఎన్నికలు నిర్వహిస్తారు. పోటీలోని అభ్యర్థుల పేర్లు, వారి పార్టీ గుర్తులతో బ్యాలెట్ పేపర్ల ముద్రణ మంగళవారం నుంచి ప్రారంభం కానుంది. పలమనేరు మున్సిపాలిటీకి సంబంధించి బ్యాలెట్ పత్రాల ముద్రణ విజయవాణి ప్రింటింగ్ ప్రెస్‌లోను.. మిగతావి చిత్తూరులోని కో-ఆపరేటివ్ ప్రింటింగ్ ప్రెస్‌లో ముద్రింఛనున్నారు. మేయర్, చైర్మన్ పదవుల అభ్యర్థులకు పింక్ కలర్.. కార్పొరేటర్, కౌన్సిలర్ల పదవులకు తెలుపురంగులో బ్యాలెట్ పత్రాలు సిద్ధమవుతున్నాయి. నవంబరు ఒకటిన పోలింగ్ జరగనున్న దృష్ట్యా రెండు రోజుల్లో బ్యాలెట్ పేపర్ల ముద్రణ పూర్తి చేస్తారు. ఆ తర్వాత జడ్పీటీసీ, ఎంపీటీసీ బ్యాలెట్ పత్రాల ముద్రణ చేపట్టనున్నారు. సోమవారం మున్సిపాలిటీకి సంబంధించి పోస్టల్ బ్యాలెట్ ముద్రణ పూర్తయింది.
50 శాతం పూర్తయిన ‘పంచాయతీ’ బ్యాలెట్ల ముద్రణ
మున్సిపల్, పరిషత్ ఎన్నికల ఓట్ల లెక్కింపు అనంతరం ఈ బ్యాలెట్ పెట్టెలను పంచాయతీ ఎన్నికలకు వినియోగిస్తారు. మున్సిపాలిటీ, జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు పార్టీ గుర్తుల ఆధారంగా.. పంచాయతీ ఎన్నికలు పార్టీలరహితంగా జరగనున్నాయి. మునిసిపాలిటీ, జడ్పీటీసీ, ఎంపీటీసీ బ్యాలెట్ పేపర్‌పై పోటీలోని అభ్యర్థుల పేర్లు వారి అనుసంధానంగా పార్టీ గుర్తులు ఉంటాయి. పంచాయతీ ఎన్నికలు మాత్రం పార్టీలరహితంగా జరుగుతుంది. ఈ పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్, వార్డు సభ్యుల పేర్లకు బదులు వారికి కేటాయించిన గుర్తులు మాత్రమే బ్యాలెట్ పేపర్‌పై ఉండేలా ముద్రణ జరుగుతోంది. ఇప్పటికే 50 శాతం మేర గ్రామపంచాయతీ బ్యాలెట్ పేపర్ల ముద్రణ పూర్తయింది.