పొదల్లో పసికందు
ABN , Publish Date - Mar 05 , 2026 | 12:50 AM
ఆ తల్లికి ఏ కష్టమొచ్చిందోకాని... 9 నెలలు మోసి ప్రసవించిన పసికందును ముళ్ల పొదల్లో వదిలివెళ్లింది.
నాయుడుపేట టౌన్, మార్చి 4 (ఆంధ్రజ్యోతి) : ఆ తల్లికి ఏ కష్టమొచ్చిందోకాని... 9 నెలలు మోసి ప్రసవించిన పసికందును ముళ్ల పొదల్లో వదిలివెళ్లింది.నాయుడుపేట పట్టణం చంద్రబాబుకాలనీ సమీపంలోని పొదల్లో బుధవారం ఉదయం మూలుగుతున్న శబ్దం విన్న ఓ యువకుడు వెళ్లి చూశాడు.అక్కడ కొత్తపేగు కూడా తీయని ఓ పసికందును గుర్తించాడు. వెంటనే పోలీసులకు, ఐసీడీఎస్ అధికారులకు కాలనీవాసులు సమాచారం అందించారు.సీడీపీవో ఉమామహేశ్వరి అంగన్‌వాడీ సిబ్బందితో కలసి ఆ పసికందును నాయుడుపేట వైద్యశాలకు తరలించారు. వైద్య పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు ఆ పాప ఆరోగ్యంగా ఉన్నట్లు వెల్లడించారు. తిరుపతిలోని చైల్డ్ హోమ్‌కు పసికందును తరలిస్తున్నట్లు సీడీపీవో ఉమామహేశ్వరి తెలిపారు.