Share News

అయ్యపనాయుని చెరువు ఇక సుందరంగా..

ABN , Publish Date - May 16 , 2026 | 01:37 AM

రూ.2 కోట్ల మంజూరుకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్‌ తొలివిడతో రూ.46 లక్షలు విడుదల

అయ్యపనాయుని చెరువు ఇక సుందరంగా..
పీలేరు అయ్యపనాయుని చెరువు

పీలేరు, మే 15(ఆంధ్రజ్యోతి): పీలేరులోని అయ్యపనాయుని చెరువును అభివృద్ధి చేసి, సుందరీకరిస్తామని ఎన్నికల సందర్భంగా హామీ ఇచ్చిన ఎమ్మెల్యే నల్లారి కిశోర్‌ కుమార్‌ రెడ్డి దాన్ని నిలబెట్టుకునే దిశగా అడుగులు వేస్తున్నారు. ఆయన కృషి ఫలించి ప్రభుత్వం చెరువు అభివృద్ధి, సుందరీకరణ కోసం రూ.2 కోట్లు అందించేందుకు సూత్రప్రాయంగా అంగీకరించింది. తొలి విడతలో రూ.45 లక్షలు మంజూరు చేసింది. దీంతో అధికారులు, స్థానిక టీడీపీ నేతలు వారం రోజులుగా పనులు చేపట్టారు. చెరువుతోపాటు కట్టపై ఉన్న ముళ్లపొదలను తొలగిస్తున్నారు. ఈ పనులు పూర్తికాగానే చెరువు చుట్టూ విశాలమైన వాకింగ్‌ ట్రాక్‌ నిర్మించనున్నారు. ప్రజలు కూర్చునేందుకు వీలుగా బెంచీలు, నీడనిచ్చే గార్డెనింగ్‌ ఏర్పాటు చేయనున్నారు. రాత్రివేళ వెలుగులు విరజిమ్మేలా రంగురంగుల విద్యుత్‌ దీపాలు అమర్చుతారు. పిల్లల కోసం ప్రత్యేకంగా ప్లే ఏరియా ఏర్పాటు చేయనున్నారు.

Updated Date - May 16 , 2026 | 01:37 AM