Share News

అందుబాటులో పోలీసు సేవలు

ABN , Publish Date - Mar 19 , 2026 | 02:37 AM

మదనపల్లె జిల్లా ప్రజలకు పోలీసు సేవలు అందుబాటులో ఉండేలా అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు కర్నూలు డీఐజీ కోయ ప్రవీణ్‌ తెలిపారు.

అందుబాటులో పోలీసు సేవలు
శిలాఫలకాన్ని ఆవిష్కరిస్తున్న డీఐజీ ప్రవీణ్‌, కలెక్టర్‌ నిశాంత్‌కుమార్‌, ఎస్పీ ధీరజ్‌, ఎమ్మెల్యే షాజహాన్‌

మదనపల్లె అర్బన్‌, మార్చి18(ఆంధ్రజ్యోతి): జిల్లా ప్రజలకు పోలీసు సేవలు అందుబాటులో ఉండేలా అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు కర్నూలు డీఐజీ కోయ ప్రవీణ్‌ తెలిపారు. శాంతి భద్రతలు, మహిళా రక్షణ, న్యాయ చట్టబద్ధమైన సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నట్లు చెప్పారు. స్థానిక బెంగళూరు రోడ్డులో బుధవారం ఉదయం నూతన ఎస్పీ కార్యాలయంలో కార్యకలాపాలను ప్రారంభించారు. ముఖ్య అతిథులుగా కర్నూలు డీఐజీ కోయ ప్రవీణ్‌తో పాటు కలెక్టర్‌ నిశాంత్‌కుమార్‌, ఎమ్మెల్యే షాజహాన్‌బాషా, సబ్‌ కలెక్టర్‌ చల్లా కళ్యాణి హాజరయ్యారు. ముందుగా పూజలు చేసి, ఎస్పీ కార్యాలయం శిలాపలకాన్ని ఆవిష్కరించారు. ఎస్పీ క్యాబిన్‌, ఎస్పీ అడ్మినిస్ర్టేషన్‌, అడిషనల్‌ ఎస్పీ, డీసీఆర్బీ, ఐటీకోర్‌ టీం, కాన్ఫరెన్స్‌ హాల్‌, ఏఆర్‌ డీఎస్పీ కార్యాలయాలను ప్రారంభించారు. అనంతరం కార్యాలయంపై జెండా అవిష్కరించి వందనం చేశారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ వెంకటాద్రి, డీఎస్పీలు ఏడుకొండలు, కృష్ణమోహన్‌, సీఐలు రాజారెడ్డి, ఎస్‌ఎం రఫీ, జనపేన నేత రాందా్‌సచౌదరి, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ జంగాల శివరాం, బీజేపీ నాయకులు గోల్డెన్‌వ్యాలీ రమణారెడ్డి, వరదారెడ్డి నారదరెడ్డి, విశ్వబ్రహ్మణ కార్పొరేషన్‌ రాష్ట్ర డైరెక్టర్‌ రామకృష్ణ, టీడీపీ నేతలు శశిధర్‌ కుమార్‌, సిమెంట్‌ రమణ, ఎర్రబల్లె వెంకటరమణారెడ్డి పాల్గొన్నారు.

రూ.1.56కోట్ల మొబైల్స్‌ రికవరీ

మదనపల్లె జిల్లావ్యాప్తంగా చోరీకి గురైన రూ.1.56కోట్ల విలువైన 716 సెల్‌ఫోన్లను పోలీసులు రికవరీ చేశారు. బుధవారం మదనపల్లెలో ఎస్పీ కార్యాలయ ప్రారంభోత్సవానికి వచ్చిన కర్నూలు డీఐజీ కోయ ప్రవీణ్‌ చేతుల మీదుగా వాటిని బాధితులకు అందజేశారు. ఎస్పీ ధీరజ్‌, ఏఎస్పీ వెంకటాద్రి, డీఎస్పీలు, టెక్నికల్‌ సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Mar 19 , 2026 | 02:37 AM