ఆటో ఎక్స్‌పో ప్రారంభం
ABN , Publish Date - Mar 22 , 2026 | 01:12 AM
ఆంధ్రజ్యోతి, ఏబీఎన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆటో ఎక్స్‌పో తిరుపతిలోని ఇందిరా మైదానంలో శనివారం ఉదయం ప్రారంభమైంది.జిల్లా రవాణాశాఖాధికారి కొర్రపాటి మురళీమోహన్ ఆటో ఎక్స్‌పోను పలు వాహనాలను పరిశీలించారు.స్టాళ్ల నిర్వాహకులు వాహనాల ప్రత్యేకతలను ఆయనకు వివరించారు.
తిరుపతి(రవాణా), మార్చి 21 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రజ్యోతి, ఏబీఎన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆటో ఎక్స్‌పో తిరుపతిలోని ఇందిరా మైదానంలో శనివారం ఉదయం ప్రారంభమైంది.జిల్లా రవాణాశాఖాధికారి కొర్రపాటి మురళీమోహన్ ఆటో ఎక్స్‌పోను పలు వాహనాలను పరిశీలించారు.స్టాళ్ల నిర్వాహకులు వాహనాల ప్రత్యేకతలను ఆయనకు వివరించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆటో ఎక్స్‌పోలో వివిధ కంపెనీల కార్లు, ద్విచక్ర వాహనాలు ఒకే చోట ఉండటం వల్ల వినియోగదారులకు సులువుగా ఉంటుందని అభిప్రాయపడ్డారు.వాహనాన్ని కొనుగోలు చేసే సమయంలో ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటామో రహదారిపై ప్రయాణించేటప్పుడు కూడా అంతే బాధ్యతగా వుండాలన్నారు.ఆంరఽధజ్యోతి తిరుపతి యూనిట్ మేనేజరు వి.సురే్‌షరెడ్డి , ఎడిషన్ ఇన్‌చార్జి వి.సుధాకర బాబు, బ్యూరో ఇన్‌చార్జి కె.శివప్రసాద్, స్టాఫ్ రిపోర్టర్లు పి.నరేంద్ర, దినేష్‌కుమార్, యాడ్ మేనేజరు ఈశ్వర నాయుడు,డీసీఎం ఉమాపతి తదితరులు పాల్గొన్నారు.
వాహనప్రియుల సందడి
ఆటోమొబైల్ కంపెనీలన్నీ ఎక్స్‌పోలో పాల్గొనడంతో ఇందిరా మైదానం కొనుగోలుదారులతో సందడిగా మారింది. 13 స్టాళ్లలో యువతను ఆకర్షించే బైక్‌లు, ఎలక్ట్రిక్ వాహనాలు, కొత్త కార్ల మోడళ్లు, కమర్షియల్ వాహనాలు కొలువుదీరాయి.వాహనప్రియులు నచ్చిన వాహనాలను టెస్ట్ డ్రైవ్ చేసి వివరాలు తెలుసుకుని కొనుగోలు చేశారు.ఆదివారం ఉదయం 10 నుంచి రాత్రి 8.30గంటల వరకు ఎక్స్‌పో కొనసాగనుంది. ప్రధాన స్పాన్సరర్‌గా పుత్తూరు సమీపంలోని సిద్ధార్థ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ వ్యవహరించగా మారుతి సుజుకి, వెస్పా, వోక్స్‌వేగన్, హోండా, హీరో, సుజుకి, బజాజ్, నెక్సా, యమహా, నిస్సాన్, కమర్షియల్ హుండాయ్, టయోటా, స్కోడా తదితర కంపెనీల ద్విచక్ర, నాలుగు చక్రాల వాహనాలు కొలువుదీరాయి.