Share News

ఆటో ఎక్స్‌పో విజయవంతం

ABN , Publish Date - Mar 22 , 2026 | 11:38 PM

ఆధునిక సాంకేతికత, సరికొత్త డిజైన్లు, పర్యావరణ హిత (ఈవీ)వాహనాలతో శని, ఆదివారాల్లో నిర్వహించిన ఆటో ఎక్స్‌పో విజయవంతమైంది

ఆటో ఎక్స్‌పో విజయవంతం
ఏబీఎన్‌-ఆంధ్రజ్యోతి అందజేసిన జ్ఞాపికలతో స్టాళ్ల నిర్వాహకులు

తిరుపతి (సెంట్రల్‌), మార్చి 22 (ఆంధ్రజ్యోతి): ఏబీఎన్‌ - ఆంధ్రజ్యోతి ఆధ్వర్యంలో ఆధునిక సాంకేతికత, సరికొత్త డిజైన్లు, పర్యావరణ హిత (ఈవీ)వాహనాలతో తిరుపతి ఇందిరా మైదానంలో శని, ఆదివారాల్లో నిర్వహించిన ఆటో ఎక్స్‌పో విజయవంతమైంది. ఈ ప్రదర్శనను శనివారం జిల్లా రవాణాశాఖ అధికారి కె.మురళీమోహన్‌ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించిన విషయం తెలిసిందే. 13 స్టాల్స్‌తో ఎలక్ర్టిక్‌ వాహనాలు, యువతను ఆకర్షించే బైకులు, కుటుంబాల కోసం కొత్త కారు మోడళ్లు, కమర్షియల్‌ వాహనాలు ఇలా అన్నీ ఒకే వేదికపైకి వచ్చి తాజా మోడళ్లను ప్రదర్శించాయి. ముఖ్యంగా స్మార్ట్‌ టెక్నాలజీతో కూడిన బైక్‌లు సందర్శకులను ఆకట్టుకున్నాయి. పలువురు ఈవీ ద్విచక్ర వాహనాలను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపారు. ఎక్స్‌పోలో టెస్ట్‌ డ్రైవ్‌లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. కుటుంబాలతో కలిసి వచ్చిన సందర్శకులు కొత్త మోడళ్లను సమీక్షిస్తూ కొనుగోలుపై ఆసక్తి చూపారు. పెద్దఎత్తున కార్లు, ద్విచక్రవాహనాలను స్పాట్‌లోనే కొనుగోలు చేయడంతోపాటు షోరూంకు వెళ్లి కొనుగోలు చేసేందుకు పేర్లను నమోదు చేసుకున్నారు.

జ్ఞాపికల అందజేత

ఆదివారం సాయంత్రం జరిగిన ముగింపు కార్యక్రమంలో స్టాళ్ల నిర్వాహకుల(వివిధ కంపెనీల జనరల్‌ మేనేజర్లు, ప్రతినిధుల)కు జ్ఞాపికలను ఆంధ్రజ్యోతి తిరుపతి బ్రాంచి మేనేజరు సురే్‌షరెడ్డి అందజేశారు. ఆటో ఎక్స్‌పోలో.. భార్గవి ఆటోమొబైల్స్‌, నికిమోటార్స్‌, వోక్స్‌వ్యాగన్‌ పీపీఎస్‌, సాగర్‌ హోండా, పృథ్వీ హీరో, ఎస్‌అండ్‌ఎస్‌ సుజుకి, శ్రీరామ్‌ ఎంటర్‌ప్రైజెస్‌, నెక్సా భార్గవి ఆటోమొబైల్స్‌, యమహా ఆర్కే ఎంటర్‌ప్రైజెస్‌, సీజెన్‌ హైటెక్‌ మోటార్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, హుండాయ్‌ ఆర్కే ఎంటర్‌ప్రైజెస్‌, హర్ష ఆటో ఏజెన్సీస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌కు చెందిన స్టాల్స్‌ నిర్వాహకులు సంతృప్తి వ్యక్తం చేశారు. ఆటో ఎక్స్‌పోకి సిద్ధార్థ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇంజనీరింగ్‌ అండ్‌ టెక్నాలజీ విద్యాసంస్థ.. ప్రధాన స్పాన్సర్‌గా వ్యవహరించారు. ఈ ముగింపు కార్యక్రమంలో యాడ్‌ మేనేజర్‌ ఈశ్వర నాయుడు, స్టాఫ్‌ రిపోర్టర్‌ నరేంద్ర తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Mar 22 , 2026 | 11:38 PM