ఇద్దరు ‘ఎర్ర’ దొంగల అరెస్టు
ABN , Publish Date - Oct 01 , 2026 | 02:11 AM
ఎర్రచందనం అక్రమ రవాణాకు పాల్పడుతున్న ఇద్దరు తమిళ స్మగర్లను అరెస్టు చేసి వారి నుంచి 6 దుంగలను స్వాధీనం చేసుకున్నట్లు పీలేరు అటవీ శాఖ ఎఫ్‌ఎ్‌సవో సబిహా సుల్తానా తెలిపారు.
నిందితులు తమిళనాడు వాసులు
పీలేరు, సెప్టెంబరు 30(ఆంధ్రజ్యోతి): ఎర్రచందనం అక్రమ రవాణాకు పాల్పడుతున్న ఇద్దరు తమిళ స్మగర్లను అరెస్టు చేసి వారి నుంచి 6 దుంగలను స్వాధీనం చేసుకున్నట్లు పీలేరు అటవీ శాఖ ఎఫ్‌ఎ్‌సవో సబిహా సుల్తానా తెలిపారు. ఆమె వివరాల మేరకు.. కేవీపల్లె మండలం నూతనకాల్వ పరిసర ప్రాంతాల్లో ఎర్రచందనం అక్రమ జరుగుతోందన్న రహస్య సమాచారం మేరకు పీలేరు అటవీ సిబ్బంది నూతనకాల్వ, గుట్టలపై గ్రామాల మధ్య మంగళవారం రాత్రి వాహనాల తనిఖీ చేపట్టారు. గుట్టలపై గ్రామం నుంచి నూతనకాల్వవైపు ఒక మోటరు సైకిల్, దాని వెనుక ఒక కారు వస్తుండటాన్ని గమనించి ఆపారు. పారిపోయే ప్రయత్నం చేయగా చాకచక్యంగా పట్టుకున్నారు. కారులో 60.5 కేజీల బరువున్న ఆరు ఎర్రచందనం దుంగలు లభ్యమయ్యాయి. పట్టుబడిన ఇద్దరు తమిళనాడు రాష్ట్రం వేలూరు జిల్లా అబ్దుల్లాపురానికి చెందిన నరేశ్‌కుమార్, తిరువణ్ణామలై జిల్లా సేవూరుకు చెందిన బాలా కుమార్‌గా నిర్ధారించారు. వారిని తిరుపతిలోని ఎర్రచందనం కేసుల ప్రత్యేక కోర్టుకు తరలించారు. ఈ దాడిలో ఎఫ్‌బీవోలు జగదీశ్, రెడ్డి ఆసియాబీ, చంద్రకళ, శ్రీనివాసన్, బేస్ క్యాంపు సిబ్బంది నవీన్ కుమార్, రెడ్డి కుమార్, మస్తాన్ సాహెబ్, ఆంజినేయులు, మహేంద్ర, నాగేంద్ర పాల్గొన్నారు.