Share News

కాణిపాకంలో ఉగాదికి ఏర్పాట్లు

ABN , Publish Date - Mar 19 , 2026 | 02:43 AM

తెలుగు సంవత్సరాది ఉగాదిని పురస్కరించుకుని కాణిపాకంలోని వరసిద్ధుడి ఆలయంలో సిబ్బంది ఏర్పాట్లను పూర్తి చేశారు.

కాణిపాకంలో ఉగాదికి ఏర్పాట్లు
విద్యుద్దీపాలంకరణలో వరసిద్ధుడి ఆలయం

తెలుగు సంవత్సరాది ఉగాదిని పురస్కరించుకుని కాణిపాకంలోని వరసిద్ధుడి ఆలయంలో సిబ్బంది ఏర్పాట్లను పూర్తి చేశారు. ఆలయాన్ని వివిధ రకాల పుష్పాలు, అరటి బోదెలు, మామిడి ఆకులు, విద్యుద్దీపాలతో అలంకరించారు. గురువారం వేకువజామున మూలవిరాట్‌కు అభిషేకం నిర్వహించి స్వామికి చందనాలంకారంచేసి భక్తులకు దర్శన భాగ్యం కల్పించనున్నారు. ఉదయం 9 నుంచి 10.12 గంటల వరకు కల్యాణ వేదిక వద్ద పంచాంగ శ్రవణం నిర్వహించనున్నారు. ఉగాది సందర్భంగా అలయంలో ఆర్జిత సేవలనురద్దు చేసినట్లు ఈవో పెంచలకిషోర్‌ తెలిపారు. కల్యాణోత్సవం,గణపతి హోమం, ఊంజల్‌ సేవ, ఏకాంతసేవను యథావిధిగా నిర్వహించనున్నారు.

ఈనెల 27న శ్రీరామ నవమి సందర్భంగా కల్యాణ వేదిక వద్ద సీతారాముల కల్యాణాన్ని ఉదయం 11.57 నుంచి 12.46 గంటల మధ్య అభిజిత్‌ లగ్నంలో నిర్వహించనున్నట్లు ఈవో తెలిపారు. కల్యాణోత్సవం నిర్వహించ దలచిన భక్తులు కల్యాణ వేదిక వద్ద కౌంటర్లో పేర్లు

నమోదు చేసుకుని రూ.300 చెల్లించాలని సూచించారు.

- ఐరాల(కాణిపాకం), ఆంధ్రజ్యోతి

Updated Date - Mar 19 , 2026 | 02:43 AM