వేల్పుల పండుగకు ఏర్పాట్లు పూర్తి
ABN , Publish Date - Jun 06 , 2026 | 12:58 AM
తమటంవారిపల్లెలో శుక్ర, శనివారాల్లో నిర్వహించే దేవతల (వేల్పు) వేడుకలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి
గాలివీడు, జూన్ 5(ఆంధ్రజ్యోతి): మండలంలోని తమటంవారిపల్లెలో శుక్ర, శనివారాల్లో నిర్వహించే దేవతల (వేల్పు) వేడుకలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. దిగువ తమటంవారిపల్లెలో తమటం వంశస్థులు వేల్పును(దేవతల వేడుకలను) ఏర్పాటు చేశారు. పందికుంట పంచాయతీ దేవరపల్లి నుంచి పందికుంట వారి ఇరుగలమ్మ, గరుగుపల్లె పంచాయతీ పెద్దపల్లి నుంచి పసిద్దు, కమలామారి నుంచి భైరవస్వామి, తూముకుంట నుంచి భైరవస్వామి, నూలివీడు పంచాయతీ నక్కలవాండ్లపల్లె నుంచి మల్లేశ్వరుడు, పెద్దమండ్యం మండలం దిగువగొల్లపల్లె నుంచి బండమ్మ తల్లి, కలిచెర్ల చీపురంపల్లె నుంచి మూడు ఎద్దు నాణ్యాలు వేల్పుకు తరలివచ్చాయి. వాటికి తమటం వంశస్థులు ఆహ్వానం పలికారు. చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య, కడప, శ్రీ సత్యసాయి, అనంతపురం జిల్లాల నుంచి వేల సంఖ్యలో ప్రజలు హాజరుకానున్నారు. రద్దీని దృష్టిలో ఉంచుకుని పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. డీఎస్పీ, ఐదుగురు సీఐలు, 15 మంది ఎస్‌ఐలు, 150 మంది సిబ్బంది బందోబస్తును పర్యవేక్షించనున్నారు.