Share News

ప్రధాని పర్యటనకు ఏర్పాట్లు ముమ్మరం

ABN , Publish Date - Oct 12 , 2026 | 12:52 AM

తిరుపతి ఏర్పేడు సమీపంలోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రీసెర్చ్‌ (ఐసర్‌) వేదికగా డిసెంబరు 4 నుంచి 6వ తేదీ వరకు జరగనున్న అఖిల భారత పోలీస్‌ డైరెక్టర్‌ జనరల్స్‌ కాన్ఫరెన్స్‌కు ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి.

ప్రధాని పర్యటనకు ఏర్పాట్లు ముమ్మరం

ఐసర్‌తోపాటు తిరుపతిలోని హోటళ్లు,

వర్సిటీల గెస్ట్‌హౌ్‌సలను పరిశీలించిన ఐబీ అధికారులు

తిరుపతి(నేరవిభాగం), అక్టోబరు 11 (ఆంధ్రజ్యోతి): తిరుపతి ఏర్పేడు సమీపంలోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రీసెర్చ్‌ (ఐసర్‌) వేదికగా డిసెంబరు 4 నుంచి 6వ తేదీ వరకు జరగనున్న అఖిల భారత పోలీస్‌ డైరెక్టర్‌ జనరల్స్‌ కాన్ఫరెన్స్‌కు ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఈ సదస్సుకు ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ ధోవల్‌, అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల డీజీపీలు, సుమారు 400 మంది ఐపీఎస్‌ అధికారులు హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో వసతి ఏర్పాట్లపై అధికారులు దృష్టి సారించారు. ఆదివారం కేంద్ర ఇంటెలిజెన్స్‌ బ్యూరో (ఐబీ) అధికారులు వెంకటప్పలనాయుడు, విషాల్‌గున్నీ తదితర అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలన చేశారు. ముందుగా ఐసర్‌ ప్రాంగణాన్ని పరిశీలించారు. అలాగే తిరుపతి ఐఐటీ, కలినరీ, అగ్నికల్చరల్‌, వెటర్నరీ యూనివర్సిటీల్లోని గెస్ట్‌హౌ్‌సలను పరిశీలించారు. నగరంలోని పలు స్టార్‌ హోటళ్లనూ పరిశీలించినట్టు సమాచారం. అలాగే అక్కడ చేపట్టాల్సిన భద్రతా ఏర్పాట్లపైనా చర్చించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో తిరుచానూరు తాజ్‌ హోటల్లో జిల్లా ఉన్నతాధికారులతో ఐబీ అధికారులు సమావేశమై వసతి, భద్రతా ఏర్పాట్లపై సమీక్షించారు.

Updated Date - Oct 12 , 2026 | 12:52 AM