Share News

ములకలచెరువు టీడీపీ ఎంపీటీసీలు మిస్సింగ్‌?

ABN , Publish Date - Nov 14 , 2026 | 02:29 AM

తంబళ్లపల్లె నియోజకవర్గం ములకలచెరువు మండలానికి చెందిన టీడీపీ ఎంపీటీసీలు కనిపించకపోవడం కలకలం రేపుతోంది. సొంత పార్టీకి చెందిన ఓ నాయకుడే వారిని రహస్య ప్రాంతానికి తరలించినట్లు ప్రచారం సాగుతోంది.

ములకలచెరువు టీడీపీ ఎంపీటీసీలు మిస్సింగ్‌?

అప్రమత్తమైన అధిష్ఠానం..వెనక్కి రప్పించే యత్నాలు

అన్నమయ్య, నవంబర్‌ 13(ఆంధ్రజ్యోతి): తంబళ్లపల్లె నియోజకవర్గం ములకలచెరువు మండలానికి చెందిన టీడీపీ ఎంపీటీసీలు కనిపించకపోవడం కలకలం రేపుతోంది. సొంత పార్టీకి చెందిన ఓ నాయకుడే వారిని రహస్య ప్రాంతానికి తరలించినట్లు ప్రచారం సాగుతోంది. ఎంపీటీసీలకు ఇష్టం లేకపోయినా బలవంతంగా క్యాంపునకు తీసుకెళ్లి తనకు అనుకూలంగా ఉండాలని ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం. ఈ విషయం టీడీపీ అధిష్ఠానానికి చేరడంతో అప్రమత్తమయ్యారు. ఎంపీటీసీలను వెనక్కి రప్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ములకలచెరువు మండలంలో ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో 13 సాఽ్థనాలలో 8 టీడీపీ ఏకగ్రీవంగా గెలుచుకుంది. ఐదు స్థానాలకు మాత్రం ఎన్నికలు జరిగాయి. అందులో మూడింటిని టీడీపీ, జనసేన, వైసీపీ ఒక్కొక్కటి చొప్పున గెలుచుకున్నాయి. ఎంపీటీసీ స్థానాల ఏకగ్రీవానికి కృషి చేసిన దొరస్వామినాయుడు ఎంపీపీ పదవిని ఆశిస్తున్నారు. ఇదే సమయంలో టీడీపీలో ఎంపీటీసీగా గెలిచిన మరో నాయకుడు కూడా ఎంపీపీ పదవిని ఆశిస్తున్నారు. ఆయన ఎంపీటీసీలను మభ్యపెట్టి ఇతర ప్రాంతాలకు తీసుకెళ్లాడు. మొదట వీరిని హైదరాబాదులో ఉంచి తర్వాత గోవాకు తరలించినట్లు ప్రచారం ఉంది.

Updated Date - Nov 14 , 2026 | 02:29 AM