ఉమ్మడి ప్రవేశ పరీక్షలకు కన్వీనర్ల నియామకం
ABN , Publish Date - Jan 14 , 2026 | 01:46 AM
రాష్ట్రంలో వివిధ కోర్సుల్లో ప్రవేశానికి చేపట్టే ఉమ్మడి ప్రవేశ పరీక్షల నిర్వహణకు కన్వీనర్లను ప్రభుత్వం నియమించింది. రాష్ట్రంలోని యూనివర్సిటీల్లో పీజీ కోర్సుల్లో ప్రవేశానికి చేపట్టే ఏపీపీజీసెట్
తిరుపతి (విశ్వవిద్యాలయాలు), జనవరి 13 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో వివిధ కోర్సుల్లో ప్రవేశానికి చేపట్టే ఉమ్మడి ప్రవేశ పరీక్షల నిర్వహణకు కన్వీనర్లను ప్రభుత్వం నియమించింది. రాష్ట్రంలోని యూనివర్సిటీల్లో పీజీ కోర్సుల్లో ప్రవేశానికి చేపట్టే ఏపీపీజీసెట్ కన్వీనర్‌గా ఎస్వీయూనివర్సిటీ ఆర్గానిక్ కెమిస్ట్రీ ప్రొఫెసర్ పద్మావతి నియమితులయ్యారు. రాష్ట్ర వ్యాప్త లాసెట్ కన్వీనర్‌గా పద్మావతి మహిళా యూనివర్సిటీ లా విభాగ ప్రొఫెసర్ సీతాకుమారి.. బీఈడీ కోర్సులో ప్రవేశానికి చేపట్టే ఏపీఎడ్‌సెట్ కన్వీనర్‌గా ద్రవిడ యూనివర్సిటీ ఎడ్యుకేషన్ విభాగ ప్రొఫెసర్ శ్రీనివాస కుమార్‌ను నియమించారు. మే 4న లాసెట్, ఎడ్‌సెట్, మే 5వ తేది నుంచి ఏపీపీజీసెట్ పరీక్షలు నిర్వహించనున్నట్టు ఆయన వెల్లడించారు.