Share News

కేవీలో ఖాళీ సీట్ల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం

ABN , Publish Date - Jul 12 , 2026 | 01:25 AM

మంగసముద్రం కేంద్రీయ విద్యాలయ(కేవీ)లో 5వ తరగతిలో ఖాళీగా ఉన్న మూడు సీట్లను భర్తీ చేయడానికి అర్హులైన విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్‌ అనిల్‌కుమార్‌ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.

కేవీలో ఖాళీ సీట్ల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం

చిత్తూరు సెంట్రల్‌, జూలై 11(ఆంధ్రజ్యోతి): మంగసముద్రం కేంద్రీయ విద్యాలయ(కేవీ)లో 5వ తరగతిలో ఖాళీగా ఉన్న మూడు సీట్లను భర్తీ చేయడానికి అర్హులైన విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్‌ అనిల్‌కుమార్‌ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. విద్యార్థి 1 ఏప్రిల్‌ 2014-2016 మధ్య జన్మించి ఉండాలన్నారు. అర్హులైన విద్యార్థులు ఈఅవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఈనెల 18లోపు బర్త్‌ సర్టిఫికేట్‌, కుల ధ్రువీకరణ పత్రం, ఆధార్‌, చిరునామా ఫ్రూఫ్‌, ఒక ఫోటోతో దరఖాస్తు చేసుకోవాలని వివరించారు.

Updated Date - Jul 12 , 2026 | 01:25 AM