Share News

స్పోర్ట్స్‌ స్కూల్‌ ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

ABN , Publish Date - May 22 , 2026 | 01:47 AM

శాప్‌ ఆధ్వర్యంలో కడపలో నిర్వహిస్తున్న డాక్టర్‌ వైఎస్సార్‌ స్పోర్ట్స్‌ స్కూల్లో ప్రవేశాలకు ఆన్‌లైన్‌ దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా క్రీడాభివృద్ధి అధికారి శశిఽధర్‌ గురువారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

స్పోర్ట్స్‌ స్కూల్‌ ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

తిరుపతి అర్బన్‌, మే 21(ఆంధ్రజ్యోతి): శాప్‌ ఆధ్వర్యంలో కడపలో నిర్వహిస్తున్న డాక్టర్‌ వైఎస్సార్‌ స్పోర్ట్స్‌ స్కూల్లో ప్రవేశాలకు ఆన్‌లైన్‌ దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా క్రీడాభివృద్ధి అధికారి శశిఽధర్‌ గురువారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. 4నుంచి 6వ తరగతి ప్రవేశాల కోసం జిల్లా, రాష్ట్రస్థాయి ఎంపిక పరీక్షలు రెండు దశల్లో నిర్వహిస్తారు. 7నుంచి 9వ తరగతి వరకు రాష్ట్రస్థాయి మాత్రమే ఎంపిక పరీక్షలు ఉంటాయి. అథ్లెటిక్స్‌, ఆర్చరీ, బాక్సింగ్‌, ఫుట్‌బాల్‌, జిమ్నాస్టిక్స్‌, హాకీ, వాలీబాల్‌, వెయిట్‌ లిఫ్టింగ్‌, తదితర క్రీడల్లో నైపుణ్య శిక్షణతో పాటు ఆంగ్లంలో విద్యను బోధిస్తారు. ఆసక్తి, అర్హత కలిగిన విద్యార్థులు వచ్చేనెల 2వ తేదీ లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవాలని, పూర్తి సమాచారం కోసం హెచ్‌టీటీపీఎ్‌స://ఏపీస్పోర్ట్స్‌స్కూల్‌.ఈపీ.జీవోవీ.ఇన్‌/ వెబ్‌సైట్‌ను సంప్రదించాలని ఆయన కోరారు.

Updated Date - May 22 , 2026 | 01:47 AM