Share News

ఫిజియోథెరపీ ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం

ABN , Publish Date - May 15 , 2026 | 01:00 AM

జిల్లాలోని భవిత కేంద్రాల్లో ఖాళీగా ఉన్న ఏడు ఫిజియోథెరపీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు సమగ్రశిక్ష ఏపీసీ వెంకటరమణ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.

ఫిజియోథెరపీ ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం

చిత్తూరు సెంట్రల్‌, మే 14(ఆంధ్రజ్యోతి): జిల్లాలోని భవిత కేంద్రాల్లో ఖాళీగా ఉన్న ఏడు ఫిజియోథెరపీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు సమగ్రశిక్ష ఏపీసీ వెంకటరమణ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. చిత్తూరు, యాదమరి, గుడిపాల, బంగారుపాళ్యం, తవణంపల్లి, ఐరాల, రొంపిచెర్ల, పులిచెర్ల, పూతలపట్టు, పలమనేరు, గంగవరం, పెద్దపంజాణి, రామకుప్పం, వి.కోట, బైరెడ్డిపల్లె, పెనుమూరు, జీడీ నెల్లూరు, వెదురుకుప్పం, కార్వేటినగరం, ఎస్‌ఆర్‌పురం, పాలసముద్రం మండలాల్లోని కేంద్రాల్లో ఫిజియోథెరపీ చేయడానికి ఏదైనా విశ్వవిద్యాలయం నుంచి బీపీటీ/ఎంపీటీ సర్టిఫికెట్‌ పొందిన వారు అర్హులన్నారు. ఈనెల 25లోపు జిల్లా సమగ్రశిక్ష కార్యాలయంలో దరఖాస్తులను సమర్పించాలని కోరారు.

Updated Date - May 15 , 2026 | 01:00 AM