Share News

కేజీబీవీల్లో నాన్‌ టీచింగ్‌ ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం

ABN , Publish Date - Jan 05 , 2026 | 01:59 AM

సమగ్రశిక్ష ద్వారా జిల్లాలో నిర్వహిస్తున్న ఎనిమిది కస్తూర్భా గాంధీ బాలికా విద్యాలయా (కేజీబీవీ)ల్లో 34 నాన్‌ టీచింగ్‌ ఉద్యోగాలను అవుట్‌సోర్సింగ్‌ ద్వారా భర్తీ చేయనున్నారు.

కేజీబీవీల్లో నాన్‌ టీచింగ్‌ ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం

చిత్తూరు సెంట్రల్‌, జనవరి 4 (ఆంధ్రజ్యోతి): సమగ్రశిక్ష ద్వారా జిల్లాలో నిర్వహిస్తున్న ఎనిమిది కస్తూర్భా గాంధీ బాలికా విద్యాలయా (కేజీబీవీ)ల్లో 34 నాన్‌ టీచింగ్‌ ఉద్యోగాలను అవుట్‌సోర్సింగ్‌ ద్వారా భర్తీ చేయనున్నారు. ఈ మేరకు సమగ్రశిక్ష ఏపీసీ వెంకటరమణ తెలిపారు. కేటగిరీ 3లోని 22 పోస్టులు, కేటగిరీ 4లోని 12 పోస్టులకు ఆసక్తిగల మహిళా అభ్యర్థుల నుంచి ఈనెల 11వ తేదీలోపు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. కేటగిరీ 3లో కంప్యూటర్‌ ఇన్‌స్ట్రక్టర్‌-3, ఏఎన్‌ఎం-6, హెడ్‌ కుక్‌-1, అసిస్టెంట్‌ కుక్‌-5, నైట్‌ వాచ్‌మెన్‌-2, స్కావెంజర్‌-4, స్వీపర్‌-1 పోస్టులు ఉన్నాయి. కేటగిరీ 4లో వార్డెన్‌-3, పార్టుటైం టీచర్‌-3, చౌకీదార్‌-2, హెడ్‌ కుక్‌-2, అసిస్టెంట్‌ కుక్‌-2 పోస్టులు ఉన్నాయి. 18-45 ఏళ్ల మధ్య వయసున్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎ్‌సలకు 5ఏళ్లు, దివ్యాంగులకు ఏడేళ్ల వయో సడలింపు ఉంది. పూర్తి చేసిన దరఖాస్తులను 11వ తేదీలోపు జిల్లా సమగ్రశిక్ష కార్యాలయంలో సమర్పించాలని ఏపీసీ తెలిపారు.

Updated Date - Jan 05 , 2026 | 01:59 AM