మదనపల్లె అల్లనేరేడుకు జీఐ ట్యాగు గుర్తింపునకు దరఖాస్తు
ABN , Publish Date - Feb 16 , 2026 | 01:10 AM
మదనపల్లె అల్లనేరేడుకు మంచి గుర్తింపు ఉంది. వీటికి జీఐ ట్యాగు గుర్తింపునకు దరఖాస్తు చేసినట్లు మండలంలోని డీమ్డ్ టు బీ మిట్స్ యూనివర్సిటీ వీసీ యువరాజ్ తెలిపారు.
కురబలకోట, ఫిబ్రవరి 15(ఆంధ్రజ్యోతి) : మదనపల్లె అల్లనేరేడుకు మంచి గుర్తింపు ఉంది. వీటికి జీఐ ట్యాగు గుర్తింపునకు దరఖాస్తు చేసినట్లు మండలంలోని డీమ్డ్ టు బీ మిట్స్ యూనివర్సిటీ వీసీ యువరాజ్ తెలిపారు. ఆదివారం కళాశాలలో ఆయన మీడియాతో మాట్లాడుతూ మదనపల్లెలోని మిట్స్-ఐపీఎ్‌ఫసీ మద్దతుతో శ్రీదేవి జామున్ సొసైటీతో కలిసి జిఐ ట్యాగ్ కోసం చెన్నైలోని సూచికల రిజిస్ర్టీ ఐపీఆర్ కార్యాలయంలో అధికారకంగా దరఖాస్తు చేసినట్లు వివరించారు. దీంతో మదనపల్లె అల్లనేరేడుకు ప్రత్యేక గుర్తింపుతో పాటు అంతర్జాతీయ మార్కెటింగ్‌కు దోహదపడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో వర్సిటీ ప్రో ఛాన్సులర్ ధ్వారకనాథ్, డీన్‌లు తులసీరామ్‌నాయుడు, శివయ్య, రవీంద్ర పాల్గొన్నారు.