Share News

కడప తమలపాకులకు జీఐ ట్యాగు గుర్తింపునకు దరఖాస్తు

ABN , Publish Date - Jun 23 , 2026 | 12:45 AM

కడప తమలపాకులకు జీఐ ట్యాగు గుర్తింపునకు దరఖాస్తు చేసినట్లు వర్సిటీ వీసీ యువరాజ్‌పేర్కొన్నారు

కడప తమలపాకులకు జీఐ ట్యాగు గుర్తింపునకు దరఖాస్తు
దరఖాస్తును ప్రదర్శిస్తున్న వీసీ యువరాజ్‌

కురబలకోట, జూన్‌ 22(ఆంధ్రజ్యోతి) : మండలంలోని డీమ్డ్‌ టు బీ మిట్స్‌ యూనివర్సిటీ యాజమాన్యం శ్రీలక్మీ బీటెల్‌ లీవ్స్‌ సొసైటీ లిమిటెడ్‌తో కలిసి కడప తమలపాకులకు జీఐ ట్యాగు గుర్తింపునకు దరఖాస్తు చేసినట్లు వర్సిటీ వీసీ యువరాజ్‌పేర్కొన్నారు. సోమవారం కళాశాలలో ఆయన ఆ వివరాలను మీడియాకు వెల్లడించారు. కడప తమలపాకులకు దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు ఉందన్నారు. ఇక్కడ సాగు చేసిన పంటకు ఆకుపచ్చ రంగు, మెరిసే ఉపరితలం, మృదుత్వం, సమాన పరిమాణం, ప్రత్యేక ఘాటు రుచి, ఎక్కువ కాలం నిల్వ ఉండటంతో పాటుగా ప్రకాశవంతమైన రంగులతో ఉంటుందని వివరించారు. దానికి ప్రత్యేక గుర్తింపు తీసుకురావడంలో భాగంగా జీఐ ట్యాగ్‌ కోసం చెన్నైలోని సూచికల రిజిస్ర్టీ ఐపీఆర్‌ కార్యాలయంలో దరఖాస్తు చేసినట్లు చెప్పారు. గుర్తింపు వస్తే అంతర్జాతీయ మార్కెటింగ్‌కు దోహదపడుతుందన్నారు. కాగా, మిట్స్‌, శ్రీలక్మీ బీటెల్‌ లీవ్స్‌ సొసైటీ లిమిటెడ్‌ సిబ్బందిని చాన్సులర్‌ ఎన్‌.విజయభాస్కర్‌ చౌదరి అభినందించారు.

Updated Date - Jun 23 , 2026 | 12:45 AM