అనంతపురం వేరుఽశనగకు జీఐ ట్యాగు గుర్తింపునకు దరఖాస్తు
ABN , Publish Date - Jul 27 , 2026 | 02:18 AM
అనంతపురం వేరుఽశనగకు జీఐ ట్యాగు గుర్తింపు కోసం దరఖాస్తు చేసినట్లు మండలంలోని మిట్స్ యూనివర్సిటీ వీసీ యువరాజ్ తెలిపారు.
కురబలకోట, జులై 26(ఆంధ్రజ్యోతి) : అనంతపురం వేరుఽశనగకు జీఐ ట్యాగు గుర్తింపు కోసం దరఖాస్తు చేసినట్లు మండలంలోని మిట్స్ యూనివర్సిటీ వీసీ యువరాజ్ తెలిపారు. కళాశాలలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ అనంతపురం జిల్లాలోని ప్రత్యేక వాతావరణం, ఎర్రటి ఇసుక మిశ్రమ నేలలు, తక్కువ వర్షపాతం, అధిక ఉష్ణోగ్రతలు తదితర కారణాలతో ఇక్కడి వేరుశనగ ప్రత్యేక నాణ్యతను సంతరించుకుందని తెలిపారు. ఎరుపు, లేతక్రీమ్ రంగు, అధిక నూనె శాతం, ఎక్కువ కాలం నిల్వ వీటి ప్రత్యేకతలుగా చెప్పారు. వీటికి మరింత గుర్తింపు తీసుకొచ్చేందుకు మదనపల్లెలోని మిట్స్-ఐపీఎ్‌ఫసీ మద్దతుతో అవని ఫారం ల్యాబ్ టెక్నాలజీస్ ఫార్మర్స్ ప్రొడ్యూసర్ కంపెనీ లిమిటెడ్‌తో కలిసి జీఐ ట్యాగ్ కోసం చెన్నైలోని సూచికల రిజిస్ర్టీ ఐపీఆర్ కార్యాలయంలో అధికారికంగా దరఖాస్తు చేశామని వివరించారు. గుర్తింపు దక్కితే అంతర్జాతీయ మార్కెటింగ్‌కు దోహదపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఐపీఎ్‌ఫసీ సమన్వయకర్త తులసీరామ్‌నాయుడు, అసోసియేట్ డీన్ శివయ్య పాల్గొన్నారు.