Share News

ఏపీ ఈఏపీసెట్‌ ఫలితాలు విడుదల

ABN , Publish Date - Jul 02 , 2026 | 01:38 AM

యూజీ ఇంజినీరింగ్‌, అగ్రికల్చర్‌ అండ్‌ ఫార్మశీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన ఏపీ ఈఏపీసెట్‌ ఫలితాలను ప్రభుత్వం బుధవారం విడుదల చేసింది. జిల్లాలో ఇంజినీరింగ్‌ విభాగంలో 12440మంది (బాలురు7259, బాలికలు5181) విద్యార్థులకు గాను 8656 మంది అర్హత సాధించారని నిర్వాహకులు పేర్కొన్నారు. వీరిలో బాలురు 4968, బాలికలు 3688 మంది చొప్పున ఉన్నారు.

ఏపీ ఈఏపీసెట్‌ ఫలితాలు విడుదల

ఇంజినీరింగ్‌లో 8656, అగ్రిలో 3346 మంది అర్హత

తిరుపతి రూరల్‌, జూలై 1 (ఆంధ్రజ్యోతి): యూజీ ఇంజినీరింగ్‌, అగ్రికల్చర్‌ అండ్‌ ఫార్మశీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన ఏపీ ఈఏపీసెట్‌ ఫలితాలను ప్రభుత్వం బుధవారం విడుదల చేసింది. జిల్లాలో ఇంజినీరింగ్‌ విభాగంలో 12440మంది (బాలురు7259, బాలికలు5181) విద్యార్థులకు గాను 8656 మంది అర్హత సాధించారని నిర్వాహకులు పేర్కొన్నారు. వీరిలో బాలురు 4968, బాలికలు 3688 మంది చొప్పున ఉన్నారు.

ఫ అగ్రికల్చర్‌ అండ్‌ ఫార్మశీ విభాగంలో 3690 మంది (బాలురు 777, బాలికలు 2913) విద్యార్థులకు గాను 3346 మంది అర్హత సాధించారు. వీరిలో బాలురు 700, బాలికలు 2646మంది ఉన్నారు.

ఫ ఇక ఎస్వీయూ రీజియన్‌లో ఇంజినీరింగ్‌ విభాగంలో 46116 మంది బాలురకు 30489 మంది, 36026 మంది బాలికలకుగాను 24814మంది, అగ్రికల్చర్‌ అండ్‌ ఫార్మశీలో 6639 మంది బాలురుకు 5828 మంది, 19735 బాలికలకు 17413 మంది అర్హత సాధించారు.

మెరిసిన జిల్లా విద్యార్థులు

ఏపీ ఈఏపీ సెట్‌ ఫలితాల్లో పలువురు విద్యార్థులు రాష్ట్రస్థాయిలో ఉత్తమ ర్యాంకులు సాధించారు. ఇంజినీరింగ్‌ విభాగంలో వెల్దుర్తి హర్షిత్‌ 21, ఎన్‌.మహిత్‌ 87, చక్ర శ్రీకర్‌ 96, టీవీఎ్‌సశర్మ 134వ ర్యాంకు, అగ్రికల్చర్‌ అండ్‌ ఫార్మశీ విభాగంలో కె.మునిలక్ష్మీధర్‌ 46, కె.అభిజ్ఞరెడ్డి 59, హిమే్‌షచంద్‌ యాదవ్‌ 87, కె.జ్యోత్స్న చౌదరి 158, కె.ఢిల్లీరాణి 238, పి.తేజ 256, ఎ.జశ్వంత్‌రెడ్డి 268 వంటి ర్యాంకులు సాధించి మెరిశారు.

Updated Date - Jul 02 , 2026 | 01:38 AM