Share News

నేటి నుంచి అన్నమయ్య జిల్లా పరిషత్‌ పాలన

ABN , Publish Date - Sep 25 , 2026 | 01:25 AM

ఉమ్మడి చిత్తూరు జిల్లా కేంద్రంగా ఐదేళ్లపాటు సాగిన జిల్లా పరిషత్‌ పాలన గురువారంతో ముగిసింది. శుక్రవారం నుంచి అన్నమయ్య జిల్లా పరిషత్‌ పాలన ప్రారంభం కానుంది. ప్రత్యేకాధికారిగా కలెక్టర్‌ నిశాంత్‌కుమార్‌ నియమితులైన విషయం తెలిసిందే. జిల్లాలోని 25 మండలాల్లో మండల పరిషత్‌ అధ్యక్షుల పాలన కూడా గురువారం ముగిసింది. దీంతో ఈ మండలాలకు ప్రత్యేకాధికారులుగా డిప్యూటి డైరెక్టర్‌ స్థాయికి తగ్గకుండా 25 మంది అధికారులను నియమించనున్నారు

నేటి నుంచి అన్నమయ్య జిల్లా పరిషత్‌ పాలన
జిల్లా పరిషత్‌ కార్యాలయానికి కేటాయించనున్న అన్నమయ్య ఉడా కార్యాలయం

- ప్రత్యేకాధికారిగా కలెక్టర్‌ నిశాంత్‌కుమార్‌

- ఉడా కార్యాలయంలోనే కార్యకలాపాలు

మదనపల్లె టౌన్‌, సెప్టెంబరు 24(ఆంధ్రజ్యోతి): ఉమ్మడి చిత్తూరు జిల్లా కేంద్రంగా ఐదేళ్లపాటు సాగిన జిల్లా పరిషత్‌ పాలన గురువారంతో ముగిసింది. శుక్రవారం నుంచి అన్నమయ్య జిల్లా పరిషత్‌ పాలన ప్రారంభం కానుంది. ప్రత్యేకాధికారిగా కలెక్టర్‌ నిశాంత్‌కుమార్‌ నియమితులైన విషయం తెలిసిందే. జిల్లాలోని 25 మండలాల్లో మండల పరిషత్‌ అధ్యక్షుల పాలన కూడా గురువారం ముగిసింది. దీంతో ఈ మండలాలకు ప్రత్యేకాధికారులుగా డిప్యూటి డైరెక్టర్‌ స్థాయికి తగ్గకుండా 25 మంది అధికారులను నియమించనున్నారు. ఇదిలా వుండగా మదనపల్లె పట్టణంలోని జిల్లా పరిషత్‌కు సంబంధించిన భవనాల్లో పంచాయతీరాజ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌ కార్యాలయం, అన్నమయ్య ఉడా కార్యాలయానికి కేటాయించిన భవనంలోనే జిల్లా పరిషత్‌ కార్యాలయ కార్యకలాపాలు సాగించనున్నారు. కాగా అన్నమయ్య జిల్లా పరిషత్‌ కార్యాలయానికి ముగ్గురు పరిపాలన అధికారులు, ఐదుగురు సీనియర్‌ అసిస్టెంట్లు, 9 మంది జూనియర్‌ అసిస్టెంట్లు, ఇద్దరు టైపిస్టులు, ఒక రికార్డు అసిస్టెంట్‌, ఒక డ్రైవర్‌, నలుగురు అటెండర్లను కేటాయించారు.

Updated Date - Sep 25 , 2026 | 01:25 AM