Share News

రైతుల ఖాతాల్లో అన్నదాత సుఖీభవ నిధులు

ABN , Publish Date - Jun 21 , 2026 | 01:24 AM

జిల్లాలోని రైతుల ఖాతాల్లో అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్‌ నిధులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జమచేశాయి. ఒక్కో రైతుకు రూ.7వేలు చొప్పున మొత్తం 1,78,385 మంది ఖాతాల్లో రూ.117.61 కోట్లు జమయ్యాయి. 2026-27 ఆర్థిక సంవత్సరానికి అన్నదాత సుఖీభవ కింద రూ.5వేలు చొప్పున మొదటి విడతలో రూ.89.19 కోట్లు, పీఎం కిసాన్‌ కింద రూ.2 వేలు చొప్పున 23వ విడతలో 1,42,109 మందికి రూ.28.42 కోట్లు విడుదలయ్యాయి.

రైతుల ఖాతాల్లో అన్నదాత సుఖీభవ నిధులు
చిత్తూరులో రైతులకు చెక్కు అందజేస్తున్న కలెక్టర్‌, ఎమ్మెల్యే

నియోజకవర్గాల వారీగా కార్యక్రమం నిర్వహణ

చిత్తూరు సెంట్రల్‌, జూన్‌ 20(ఆంధ్రజ్యోతి): జిల్లాలోని రైతుల ఖాతాల్లో అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్‌ నిధులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జమచేశాయి. ఒక్కో రైతుకు రూ.7వేలు చొప్పున మొత్తం 1,78,385 మంది ఖాతాల్లో రూ.117.61 కోట్లు జమయ్యాయి. 2026-27 ఆర్థిక సంవత్సరానికి అన్నదాత సుఖీభవ కింద రూ.5వేలు చొప్పున మొదటి విడతలో రూ.89.19 కోట్లు, పీఎం కిసాన్‌ కింద రూ.2 వేలు చొప్పున 23వ విడతలో 1,42,109 మందికి రూ.28.42 కోట్లు విడుదలయ్యాయి. నియోజకవర్గాల వారీగా చిత్తూరులో 11,321 మంది రైతులకు రూ.7.46 కోట్లు, పూతలపట్టులో 33,881 మందికి రూ.22.54 కోట్లు, పలమనేరులో 38,368 మందికి రూ.25.45 కోట్లు, కుప్పంలో 36,473 మందికి రూ.23.36 కోట్లు, నగరిలో 12,472 మందికి రూ.8.27 కోట్లు, జీడీ నెల్లూరులో 36,047 మందికి రూ.23.94 కోట్లు, పుంగనూరులో 9823 మందికి రూ.6.56 కోట్లు జమచేశారు. నియోజకవర్గాల వారీగా నిర్వహించిన కార్యక్రమాల్లో స్థానిక రైతులు పాల్గొన్నారు. చిత్తూరు నియోజకవర్గానికి సంబంధించి జడ్పీ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కలెక్టర్‌ సుమిత్‌ కుమార్‌, ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్‌, వ్యవసాయ శాఖ జేడీ మురళి అధికారులు పాల్గొన్నారు. రైతు సంక్షేమానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోందన్నారు. అన్ని రాకల పంటలకు అవసరమైన సబ్సిడీలు, ప్రొత్సహకాలను ప్రభుత్వం ప్రకటిస్తూ రైతులు నష్టపోకుండా చూస్తోందన్నారు. చుడా చైర్‌పర్సన్‌ కటారి హేమలత, టీడీపీ నేతలు వెంకటేష్‌, సురేంద్ర, గుడిపాల ఎంపీపీ హరిప్రసాద్‌, చిత్తూరు టౌన్‌బ్యాంక్‌ ఛైర్మన్‌ రమే్‌షనాయుడు, ప్రభు, నరేష్‌, సుబ్రమణ్యం, రైతులు పాల్గొన్నారు. ఇక, పలమనేరు నియోజకవర్గానికి సంబంధించి బైరెడ్డిపల్లెలో జరిగిన సభలో ఎమ్మెల్యే అమరనాథరెడ్డి, పూతలపట్టు నియోజకవర్గంలో ఎమ్మెల్యే మురళీమోహన్‌, పుంగనూరు నియోజకవర్గం పులిచెర్లలో టీడీపీ ఇన్‌చార్జ్‌ చల్లాబాబు, జీడీ నెల్లూరు నియోజవర్గంలో మార్కెట్‌ కమిటీ సభ్యులు, కుప్పం నియోజకవర్గంలో ఏపీఎ్‌సఆర్టీసీ వైస్‌ చైర్మన్‌ పీఎస్‌ మునిరత్నం, పీకేఎం ఉడా చైర్మన్‌ సురేష్‌ పాల్గొన్నారు.

Updated Date - Jun 21 , 2026 | 01:24 AM