Share News

పొలంలో బయటపడ్డ పురాతన నాగపడగ రాళ్లు

ABN , Publish Date - Aug 24 , 2026 | 12:27 AM

మండలంలోని పెద్దపాళ్యం సమీపంలో 32 పురాతన నాగపడగ రాళ్లు బయటపడ్డాయి. గ్రామానికి చెందిన వెంకటరమణ పొలంలో గుట్ట ఉండటంతో ఇటీవల ఎక్స్‌కవేటర్‌ సహాయంతో శుభ్రం చేయించాడు.

పొలంలో బయటపడ్డ పురాతన నాగపడగ రాళ్లు

- పూజలు చేసిన గ్రామస్తులు

ములకలచెరువు, ఆగస్టు 23(ఆంధ్రజ్యోతి): మండలంలోని పెద్దపాళ్యం సమీపంలో 32 పురాతన నాగపడగ రాళ్లు బయటపడ్డాయి. గ్రామానికి చెందిన వెంకటరమణ పొలంలో గుట్ట ఉండటంతో ఇటీవల ఎక్స్‌కవేటర్‌ సహాయంతో శుభ్రం చేయించాడు. చదును చేస్తుండగా పురాతన 32 నాగపడగ రాళ్లు బయటపడ్డాయి. వాటికి గుడికట్టి ప్రతిష్ఠించాలని ఓ పురోహితుడు రైతుకు సూచించాడు. అప్పటివరకు పెద్దపాటి గుంతను తీసి అందులో నీళ్లు పట్టి రాళ్లను ఉంచాలని సూచించాడు. దీంతో రైతు నాగపడగ రాళ్లు దొరికిన చోట ఎక్స్‌కవేటర్‌ సహాయంతో పెద్దపాటి గుంతను తీయిస్తున్నాడు. ఈ విషయం తెలిసి గ్రామస్తులు ఆ రాళ్లకు పూజలు చేశారు.

Updated Date - Aug 24 , 2026 | 12:27 AM