Share News

జంటగా వెళ్లి.. ఒంటరిగా తిరిగొచ్చిన ఏనుగు

ABN , Publish Date - Jan 28 , 2026 | 01:32 AM

ఆడ ఏనుగొచ్చింది. పులిచెర్ల మండలంలో పంటలను ధ్వంసం చేస్తూ, భయాందోళనకు గురిచేస్తున్న ఒంటరి మగ ఏనుగుతో జత కట్టింది. ఆ రెండు జంటగా ఆదివారం రాత్రి పాకాల మండలానికి వెళ్లాయి.

జంటగా వెళ్లి.. ఒంటరిగా తిరిగొచ్చిన ఏనుగు
ఒంటరి ఏనుగు దాడిలో ధ్వంసమైన మామిడిచెట్టు

దిగుమూర్తివారిపల్లి వద్ద పంటలు ధ్వంసం

కల్లూరు, జనవరి 27 (ఆంధ్రజ్యోతి): ఆడ ఏనుగొచ్చింది. పులిచెర్ల మండలంలో పంటలను ధ్వంసం చేస్తూ, భయాందోళనకు గురిచేస్తున్న ఒంటరి మగ ఏనుగుతో జత కట్టింది. ఆ రెండు జంటగా ఆదివారం రాత్రి పాకాల మండలానికి వెళ్లాయి. దీంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. కానీ.. 24 గంటలు గడవకముందే మళ్లీ మగ ఏనుగు ఒంటరిగా మండలానికి వచ్చేసింది. సోమవారం రాత్రి దిగుమూర్తివారిపల్లి వద్ద రైతులు నరసింహులు, సీతారామయ్య, భూలక్ష్మమ్మ, హైమావతికి చెందిన మామిడిచెట్ల కొమ్మలను విరిచేసింది. జొన్నపంట, పశుగ్రాసంను ధ్వంసం చేసింది. డ్రిప్‌ పైపులను తొక్కి.. నాశనం చేసింది. అక్కడ్నుంచి అడవిలోకి వెళ్లింది. ధ్వంసమైన పంటలను మంగళంపేట ఎఫ్‌బీవో మధుసూదన్‌ మంగళవారం పరిశీలించారు. స్థానికులకు మళ్లీ ఒంటరి ఏనుగు బెడద తప్పలేదు.

Updated Date - Jan 28 , 2026 | 01:32 AM