Share News

95-95-99 లక్ష్యాల సాధనతో ఎయిడ్స్‌రహిత సమాజం

ABN , Publish Date - Aug 12 , 2026 | 02:10 AM

జిల్లాలో 95-95-99 లక్ష్యాల సాధన ద్వారా హెచ్‌ఐవీ వ్యాప్తిని నియంత్రించి, ఎయిడ్స్‌రహిత సమాజం నిర్మాణానికి ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని అధికారులు పిలుపునిచ్చారు. బుధవారం అంతర్జాతీయ యువజన దినోత్సవాన్ని పురస్కరించుకుని హెచ్‌ఐవీ/ఎయిడ్స్‌పై అవగాహన కల్పించే పోస్టర్లను కలెక్టర్‌ సుమిత్‌ కుమార్‌ మంగళవారం ఆవిష్కరించారు.

95-95-99 లక్ష్యాల సాధనతో ఎయిడ్స్‌రహిత సమాజం
వైద్యాధికారుల సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌

చిత్తూరు కలెక్టరేట్‌, ఆగస్టు 11 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో 95-95-99 లక్ష్యాల సాధన ద్వారా హెచ్‌ఐవీ వ్యాప్తిని నియంత్రించి, ఎయిడ్స్‌రహిత సమాజం నిర్మాణానికి ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని అధికారులు పిలుపునిచ్చారు. బుధవారం అంతర్జాతీయ యువజన దినోత్సవాన్ని పురస్కరించుకుని హెచ్‌ఐవీ/ఎయిడ్స్‌పై అవగాహన కల్పించే పోస్టర్లను కలెక్టర్‌ సుమిత్‌ కుమార్‌ మంగళవారం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో డీఎంహెచ్‌వో డాక్టర్‌ నాగశశిభూషణ్‌రెడ్డి, అదనపు డీఎంహెచ్‌వో జి.వెంకట ప్రసాద్‌, డీసీహెచ్‌ఎ్‌స పద్మాంజలి పాల్గొన్నారు. యువతలో హెచ్‌ఐవీపై పూర్తిస్థాయి అవగాహన కల్పించడం, హెచ్‌ఐవీ వ్యాప్తిని అరికట్టడం, హెచ్‌ఐవీతో జీవిస్తున్నవారికి సకాలంలో పరీక్షలు, చికిత్స అందించడం ఎంతో ముఖ్యమని అధికారులు పేర్కొన్నారు.

95-95-99లో మనం ఎక్కడున్నాం

మొదటి 95: హెచ్‌ఐవీతో జీవిస్తున్న వారిలో 95 శాతం మందికి తమ హెచ్‌ఐవీ స్థితి గురించి తెలిసేలా పరీక్షలు నిర్వహించాలి. ఇందులో ప్రస్తుతం జిల్లా 92 శాతం ఉంది.

రెండో 95: హెచ్‌ఐవీ ఉన్నట్లు గుర్తించిన వారిలో 95 శాతం మందికి యాంటీ రిట్రోవైరల్‌ థెరపీ (ఏఆర్టీ) చికిత్స అందించాలి. ఇందులో జిల్లా ప్రస్తుతం 91శాతంగా ఉంది.

మూడో 99: చికిత్స పొందుతున్న వారిలో 99 శాతం మందిలో వైరల్‌ లోడ్‌ను అణచివేయడం ద్వారా వారి ఆరోగ్యాన్ని కాపాడుతూ హెచ్‌ఐవీ వ్యాప్తి అవకాశాలను తగ్గించాలి. ఇందులో ప్రస్తుతం జిల్లా 95శాతంగా ఉంది.

Updated Date - Aug 12 , 2026 | 02:10 AM