రేపు అమ్మవారి ఆలయం మూత
ABN , Publish Date - Mar 02 , 2026 | 01:31 AM
చంద్రగ్రహణం కారణంగా తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయం మంగళవారం ఉదయం తొమ్మిదినుంచి రాత్రి 7.30గంటల వరకు మూత వేయనున్నారు. ఈ మేరకు టీటీడీ అధికారులు తెలిపారు. శుద్ధి, పుణ్యాహవచనం తదితర కైంకర్యాలు చేశాక రాత్రి ఎనిమిది గంటల తర్వాత భక్తులను అమ్మవారి సర్వదర్శనానికి అనుమతిస్తామన్నారు. ఆ రోజున ఆలయంలో ఆర్జిత సేవలు రద్దు చేస్తున్నట్లు, భక్తులు గమనించాలని అధికారులు పేర్కొన్నారు.
తిరుచానూరు, మార్చి 1 (ఆంధ్రజ్యోతి): చంద్రగ్రహణం కారణంగా తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయం మంగళవారం ఉదయం తొమ్మిదినుంచి రాత్రి 7.30గంటల వరకు మూత వేయనున్నారు. ఈ మేరకు టీటీడీ అధికారులు తెలిపారు. శుద్ధి, పుణ్యాహవచనం తదితర కైంకర్యాలు చేశాక రాత్రి ఎనిమిది గంటల తర్వాత భక్తులను అమ్మవారి సర్వదర్శనానికి అనుమతిస్తామన్నారు. ఆ రోజున ఆలయంలో ఆర్జిత సేవలు రద్దు చేస్తున్నట్లు, భక్తులు గమనించాలని అధికారులు పేర్కొన్నారు.