‘అమరావతి చాంపియన్‌షి్‌ప’ జిల్లాస్థాయి పోటీలు ప్రారంభం
ABN , Publish Date - Aug 10 , 2026 | 01:42 AM
అమరావతి చాంపియన్‌షి్‌ప-2026 జిల్లాస్థాయి క్రీడా పోటీలు ఆదివారం తిరుపతిలో అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఎస్వీయూ, ఎస్వీయూ క్యాంపస్ మైదానాల్లో జరిగిన ఈ పోటీలను ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, కలెక్టర్ వెంకటేశ్వర్, శాప్ చైర్మన్ రవినాయుడు ప్రారంభించారు. శాప్ బోర్డు డైరెక్టర్ రజని తదితరులు పాల్గొన్నారు. తొలిరోజున అథ్లెటిక్స్, వాలీబాల్ పోటీలు హోరాహోరీగా జరిగాయి. ప్రతిభ చూపిన వారిని రాష్ట్రస్థాయికి ఎంపిక చేశారు.
తిరుపతి అర్బన్, ఆగస్టు 9 (ఆంధ్రజ్యోతి): అమరావతి చాంపియన్‌షి్‌ప-2026 జిల్లాస్థాయి క్రీడా పోటీలు ఆదివారం తిరుపతిలో అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఎస్వీయూ, ఎస్వీయూ క్యాంపస్ మైదానాల్లో జరిగిన ఈ పోటీలను ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, కలెక్టర్ వెంకటేశ్వర్, శాప్ చైర్మన్ రవినాయుడు ప్రారంభించారు. శాప్ బోర్డు డైరెక్టర్ రజని తదితరులు పాల్గొన్నారు. తొలిరోజున అథ్లెటిక్స్, వాలీబాల్ పోటీలు హోరాహోరీగా జరిగాయి. ప్రతిభ చూపిన వారిని రాష్ట్రస్థాయికి ఎంపిక చేశారు.
ఎంపికైనవారి వివరాలిలా..
ఫఅథ్లెటిక్స్: అండర్-17 బాలబాలికలు, అండర్-23 మహిళా, పురుష విభాగాల్లో దాదాపు 170మంది ప్రాతినిథ్యం వహించగా.. ప్రతిభ చూపిన 50మందిని ఎంపిక చేశారు.
ఫవాలీబాల్: అండర్-17 బాలికలు, బాలుర విభాగాల్లో 14జట్లు, అండర్-23 మహిళ, పురుష విభాగాల్లో 9 జట్లు పాల్గొన్నాయి. ప్రతిభ చూపిన అండర్-17 బాలికల విభాగంలో 12మంది, బాలురు విభాగంలో 12మంది, అండర్-23 మహిళా విభాగంలో 12మంది, పురుష విభాగంలో 12మంది రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు.