Share News

శెట్టిపల్లె లబ్ధిదారులకు ప్లాట్ల కేటాయింపు

ABN , Publish Date - Jan 17 , 2026 | 12:16 AM

సీఎం , డిప్యూటీ సీఎం , జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి చొరవతో దశాబ్దాల సమస్య పరిష్కారమైందని కలెక్టర్‌ వెంకటేశ్వర్‌ చెప్పారు

శెట్టిపల్లె లబ్ధిదారులకు ప్లాట్ల కేటాయింపు
శెట్టిపల్లె లబ్ధిదారులకు ఆన్‌లైన్‌ లాటరీ ద్వారా ప్లాట్లు కేటాయిస్తున్న సీఎం

తిరుపతి(కలెక్టరేట్‌), జనవరి 16(ఆంధ్రజ్యోతి): తిరుపతి నగరం శెట్టిపల్లె లబ్ధిదారులకు గురువారం నారావారిపల్లెలో సీఎం చంద్రబాబు ఆన్‌లైన్‌ లాటరీ ద్వారా ప్లాట్లు కేటాయించారు. దీనిపై గురువారం రాత్రి కలెక్టరేట్‌లో కార్యక్రమం జరిగింది. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌, జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి అనగాని సత్యప్రసాద్‌ చొరవతో దశాబ్దాల సమస్య పరిష్కారమైందని కలెక్టర్‌ వెంకటేశ్వర్‌ చెప్పారు. ఆన్‌లైన్‌ లాటరీ ద్వారా 2,111 మందికి ప్లాట్ల కేటాయింపును సీఎం ప్రారంభించారన్నారు. త్వరలోనే తుడా నుంచి స్థలాలను రిజిస్ట్రేషన్‌ చేసి ల్యాండ్‌ పూలింగ్‌ ఓనర్‌ డాక్యుమెంట్లను క్యూఆర్‌ కోడ్‌తో పక్కాగా హక్కు పత్రాలను లబ్ధిదారులకు పంపిణీ చేస్తామన్నారు. ఈ భూముల రిజిస్ట్రేషన్‌ కోసం రూ.16 కోట్ల విలువైన రిజిస్ట్రేషన్‌, స్టాంప్‌ డ్యూటీ ఫీజును రాష్ట్ర ప్రభుత్వం మినహాయించిందన్నారు. శెట్టిపల్లెలో వాణిజ్య సముదాయాలు, స్టార్‌ హోటళ్లు, ఇతర కన్వెనషన్లు వస్తాయన్నారు. 225 ఎకరాల్లో మోడల్‌ టౌన్‌సిటీకి ప్రభుత్వం రూ.350కోట్లు ఖర్చు పెడుతోందన్నారు. సమస్య పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవడం ఆనందంగా ఉందని ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, తుడా చైర్మన్‌ దివాకర్‌రెడ్డి పేర్కొన్నారు. అంతకుముందు కలెక్టరేట్‌ ప్రధాన గేటు నుంచి లోపల వరకు శెట్టిపల్లె లబ్ధిదారులు, మహిళలు కలెక్టర్‌, ప్రజాప్రతినిధులపై పూలు చల్లి హర్షాతికేరాలు వ్యక్తంచేశారు. ఈ కార్యక్రమంలో డీఆర్వో నరసింహులు, ఆర్డీవో రామమోహన్‌, ఎస్‌డీసీలు సుజన, తహసీల్దారు సురే్‌షబాబు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jan 17 , 2026 | 12:16 AM