జీడీనెల్లూరులో సౌర విద్యుత్ ప్లాంట్ ఏర్పాటుకు 46 ఎకరాల కేటాయింపు
ABN , Publish Date - Jun 12 , 2026 | 02:03 AM
జీడీ నెల్లూరు మండలంలో సౌర విద్యుత్ ప్లాంట్ ఏర్పాటు చేయడానికి 46.69 ఎకరాల భూమిని కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది.
చిత్తూరు సెంట్రల్, జూన్ 11 (ఆంధ్రజ్యోతి): జీడీ నెల్లూరు మండలంలో సౌర విద్యుత్ ప్లాంట్ ఏర్పాటు చేయడానికి 46.69 ఎకరాల భూమిని కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. మండలంలోని చిన్నవేపంజేరి రెవెన్యూ గ్రామం మహదేవమంగళంలో వ్యవసాయశాఖ పరిధిలోని విత్తన గణన క్షేత్రంలో ఎల్‌పీఎం నంబర్ 159లోని 46.69 ఎకరాల వ్యవసాయ భూమిని మంజూరు చేసింది. సౌర విద్యుత్ ప్లాంటును స్థాపించడానికి ఎన్‌ఆర్‌ఐడీఏపీఏపీకి 30 సంవత్సరాల కాలానికి లీజుకు ఇవ్వడానికి అనుమతి మంజూరు చేసింది.