Share News

జడ్పీటీసీ స్థానాలపై కూటమి చర్చ

ABN , Publish Date - Oct 27 , 2026 | 01:49 AM

జడ్పీటీసీ స్థానాల సర్దుబాటుపై అన్నమయ్య జిల్లా ఇన్‌ఛార్జ్‌ మంత్రి బీసీ జనార్దన రెడ్డి ఆధ్వర్యంలో సోమవారం మదనపల్లెలో కూటమి నాయకులు సమావేశమయ్యారు.

జడ్పీటీసీ స్థానాలపై కూటమి చర్చ
సమావేశమైన కూటమి నేతలు

అన్నమయ్య, అక్టోబర్‌ 26(ఆంధ్రజ్యోతి): జడ్పీటీసీ స్థానాల సర్దుబాటుపై జిల్లా ఇన్‌ఛార్జ్‌ మంత్రి బీసీ జనార్దన రెడ్డి ఆధ్వర్యంలో సోమవారం మదనపల్లెలో కూటమి నాయకులు సమావేశమయ్యారు. 25 జడ్పీటీసీ స్థానాలలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఎక్కడెక్కడ పోటీ చేయాలో చర్చించారు. జనసేన మదనపల్లె రూరల్‌, బి.కొత్తకోట జడ్పీటీసీ స్థానాలను అడిగినట్లు తెలిసింది. బీజేపీ సంబేపల్లె, ములకలచెరువు మండలాలను అడిగినట్లు సమాచారం. ఎవరెవరికి ఎన్నెన్ని సీట్లు అనేది సోమవారం రాత్రి లేదా మంగళవారం ఉదయం తేల్చనున్నారు. ఈ సమావేశంలో మంత్రి మండిపల్లె రాంప్రసాద్‌రెడ్డి, టీడీపీ జిల్లా అధ్యక్షుడు సుగవాసి ప్రసాద్‌బాబు, మదనపల్లె ఎమ్మెల్యే షాజహాన్‌బాషా, పలమనేరు ఎమ్మెల్యే అమరనాథరెడ్డి, తంబళ్లపల్లె నియోజకవర్గ ఇన్‌చార్జి శంకర్‌యాదవ్‌, బీజేపీ నేత చల్లపల్లె నరసింహారెడ్డి, జనసేన నేతలు రాందా్‌సచౌదరి, దారం అనిత, పార్టీ జోనల్‌ ఇన్‌చార్జి దామచర్ల సత్యనారాయణ పాల్గొన్నారు.

Updated Date - Oct 27 , 2026 | 01:49 AM