ఐఐటీలోకి మద్యం, గంజాయి!
ABN , Publish Date - Jun 14 , 2026 | 01:56 AM
ర్పేడు సమీపంలోని ఐఐటీ విద్యార్థులకు పట్టణంలోని కొన్ని హోటళ్లు, డాబాల నుంచి మద్యం, గంజాయి వెళుతోందని పోలీసులు అనుమానిస్తున్నారు.
ఏర్పేడు, జూన్ 13(ఆంధ్రజ్యోతి): ఏర్పేడు సమీపంలోని ఐఐటీ విద్యార్థులకు పట్టణంలోని కొన్ని హోటళ్లు, డాబాల నుంచి మద్యం, గంజాయి వెళుతోందని పోలీసులు అనుమానిస్తున్నారు. దీంతో అక్కడ తనిఖీలు సక్రమంగా చేయాలని ఎస్‌ఐ రవిప్రకాష్ ఐఐటీ సెక్యూరిటీని ఆదేశించారు. ఈ క్రమంలో శనివారం ఐఐటీకి ఫుడ్ సరఫరా చేసే వ్యక్తి నుంచి ఒక మద్యం బాటిల్‌ను అక్కడి సెక్యూరిటీ స్వాధీనం చేసుకుని పోలీసులకు అప్పగించారు. పోలీసులు అతడిని విచారించగా తాను తాగడానికి మద్యం తెచ్చుకున్నానని చెప్పినట్లు తెలుస్తోంది.