రెగ్యులర్ సర్వీస్‌గా అకోలా ఎక్స్‌ప్రెస్
ABN , Publish Date - Apr 30 , 2026 | 01:50 AM
మహారాష్ట్ర రాష్ట్రం అకోలా జంక్షన్ నుంచి ములకలచెరువు మీదుగా తిరుపతికి నడిచే సూపర్‌ఫాస్ట్ వీక్లీ ఎక్స్‌ప్రెస్ రైళ్లను రెగ్యులర్ సర్వీసుగా మారుస్తూ రైల్వేశాఖ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది.
ములకలచెరువు, ఏప్రిల్ 29(ఆంధ్రజ్యోతి): మహారాష్ట్ర రాష్ట్రం అకోలా జంక్షన్ నుంచి ములకలచెరువు మీదుగా తిరుపతికి నడిచే సూపర్‌ఫాస్ట్ వీక్లీ ఎక్స్‌ప్రెస్ రైళ్లను రెగ్యులర్ సర్వీసుగా మారుస్తూ రైల్వేశాఖ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రయాణికుల సౌకర్యార్థం ఈ మార్గంలో రైల్వే శాఖ అకోలా - తిరుపతి మధ్య వారానికి రెండు రోజులు స్పెషల్ రైళ్లను నడుపుతోంది. మంచి ఆదరణ రావడంతో రెగ్యులర్ సర్వీసుగా మార్చింది. తిరుపతి - అకోలా జంక్షన్(17429) రైలు ప్రతి ఆదివారమూ తిరుపతిలో బయలుదేరి మరుసటి రోజు అకోలా జంక్షన్‌కు చేరుతుంది. అకోలా జంక్షన్ - తిరుపతి(17430) రైలు ప్రతి శుక్రవారమూ అకోలాలో బయలురేరి శనివారం తిరుపతికి చేరుతుంది. తిరుపతి, పాకాల, పీలేరు, మదనపల్లె, ములకలచెరువు, కదిరి, ధర్మవరం, అనంతపురం, డోన్, కర్నూల్, గద్వాల్, వనపర్తి రోడ్, మహబూబ్‌నగర్, కాచిగూడ, మేడ్చల్, కామారెడ్డి, నిజామాబాద్, బాసర, ధర్మాబాద్, నాందేడ్, పూర్ణా, బస్మత్, హింగోలి దక్కన్, వాషీమ్, అకోలా రైల్వేస్టేషన్లలో ఆగుతుంది.