గంటలకొద్దీ ‘ఓపి’గ్గా..!
ABN , Publish Date - Jan 20 , 2026 | 01:17 AM
తిరుపతిలోని రుయాస్పత్రిలో ఓపీ కోసం సోమవారం అధిక సంఖ్యలో వచ్చారు. దాదాపు 20 విభాగాల్లో ఓపీలకు 2500 మందికిపైగా ఇక్కడకు వచ్చారు. ఒక్క జనరల్ మెడిసన్ కోసమే 540 మంది ఉన్నారు. 900 మంది వరకు అల్ర్టా, ఎక్స్‌రే, సిటీ, ఎంఆర్‌ఐ, స్కానింగ్‌లు చేయించుకున్నారు.
తిరుపతిలోని రుయాస్పత్రిలో ఓపీ కోసం సోమవారం అధిక సంఖ్యలో వచ్చారు. దాదాపు 20 విభాగాల్లో ఓపీలకు 2500 మందికిపైగా ఇక్కడకు వచ్చారు. ఒక్క జనరల్ మెడిసన్ కోసమే 540 మంది ఉన్నారు. 900 మంది వరకు అల్ర్టా, ఎక్స్‌రే, సిటీ, ఎంఆర్‌ఐ, స్కానింగ్‌లు చేయించుకున్నారు. ఇక, ఓపీలన్నీ ఆన్‌లైన్ చేశారు. ఆ ప్రకారం సెల్‌ఫోన్లలో యాప్‌తో క్యూఆర్ కోడ్ స్కాన్ చేశాక టోకెన్ తీసుకునేందుకు కౌంటర్ల వద్దకు వెళ్లాలి. ఎంప్లాయిస్, మహిళలు, పురుషుల కోసం మూడు కౌంటర్లు ఏర్పాటు చేసినా, ప్రతి చోట ఒక కంప్యూటరే ఉండటంతో రోగులకు నిరీక్షణ తప్పలేదు. రోగుల తాకిడిని బట్టి ఈ కౌంటర్లను పెంచే వీలుంటే ఇబ్బందులు తప్పేవి. ఈ దిశగా అధికారులు చర్యలు చేపట్టాల్సి ఉంది.
- తిరుపతి సిటీ, ఆంధ్రజ్యోతి