రేపట్నుంచి కేంద్రీయ విద్యాలయాల్లో ప్రవేశ ప్రక్రియ
ABN , Publish Date - Mar 22 , 2026 | 01:10 AM
చిత్తూరు, కుప్పంలో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన కేంద్రీయ విద్యాలయాల్లో సోమవారం నుంచి ప్రవేశ ప్రక్రియ ప్రారంభం కానుంది. చిత్తూరులోని సిల్క్ సెంటర్, కుప్పంలోని ద్రవిడ విశ్వవిద్యాలయంలో కేంద్రీయ విద్యాలయాలను తాత్కాలికంగా ఏర్పాటు చేశారు
చిత్తూరు సెంట్రల్, మార్చి 21(ఆంధ్రజ్యోతి): చిత్తూరు, కుప్పంలో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన కేంద్రీయ విద్యాలయాల్లో సోమవారం నుంచి ప్రవేశ ప్రక్రియ ప్రారంభం కానుంది. చిత్తూరులోని సిల్క్ సెంటర్, కుప్పంలోని ద్రవిడ విశ్వవిద్యాలయంలో కేంద్రీయ విద్యాలయాలను తాత్కాలికంగా ఏర్పాటు చేశారు. ఈనెల 8వ తేదీ వరకు ప్రవేశాల గడువు ఉండగా, 20 నుంచి పాఠశాలలు ప్రారంభం కానున్నాయి. రెండు కేంద్రీయ విద్యాలయాల్లో నెలాఖరు నాటికి సదుపాయాల కల్పన పూర్తి కానుంది. ఈ క్రమంలో ఇంగ్లీషు, హిందీ, మ్యాథ్స్, ఎకనామిక్స్, ఫిజిక్స్ కెమిస్ట్రీ, బయాలజీ, కామర్స్, పీజీటీ, టీజీటీ, ప్రైమరీ టీచర్లు పోస్టులు భర్తీ చేయనున్నారు. పీజీటీ కంప్యూటర్ సైన్స్/ఇన్‌స్ట్రక్టర్, డ్యాన్స్ కోచ్, స్పోర్ట్స్ కోచ్, యోగా ఇన్‌స్ట్రక్టర్, లేడీ స్టాఫ్‌నర్స్, ఎడ్యుకేషన్ కౌన్సిలర్, స్పెషల్ ఎడ్యుకేషన్, తెలుగు, ఓకేషనల్ ఇన్‌స్ట్రక్టర్లును నియమించనున్నారు.