చెన్నై-తిరుపతి రూట్లో పలు రైళ్లకు అదనపు బోగీలు
ABN , Publish Date - Jul 30 , 2026 | 01:00 AM
ప్రయాణికుల రద్దీ దృష్ట్యా చెన్నై--తిరుపతి రూట్లో పలు ఎక్స్‌ప్రెస్ రైళ్లకు అదనపు బోగీలు ఏర్పాటుచేసినట్లు దక్షిణ రైల్వే ఓ ప్రకటనలో పేర్కొంది. చెన్నై సెంట్రల్-తిరుపతి మధ్య నడిపే సప్తగిరి ఎక్స్‌ప్రెస్ రైలుకు ఆగస్టు 1నుంచి సెప్టెంబరు 30వ తేది వరకు రిజర్వ్‌డ్ సీటింగ్ బోగీ జతచేయనున్నారు.
చెన్నై, జూలై 29 (ఆంధ్రజ్యోతి): ప్రయాణికుల రద్దీ దృష్ట్యా చెన్నై--తిరుపతి రూట్లో పలు ఎక్స్‌ప్రెస్ రైళ్లకు అదనపు బోగీలు ఏర్పాటుచేసినట్లు దక్షిణ రైల్వే ఓ ప్రకటనలో పేర్కొంది. చెన్నై సెంట్రల్-తిరుపతి మధ్య నడిపే సప్తగిరి ఎక్స్‌ప్రెస్ రైలుకు ఆగస్టు 1నుంచి సెప్టెంబరు 30వ తేది వరకు రిజర్వ్‌డ్ సీటింగ్ బోగీ జతచేయనున్నారు. అలాగే, రామేశ్వరం-తిరుపతి ఎక్స్‌ప్రెస్‌కు ఆగస్టు 2 నుంచి సెప్టెంబరు 29వ తేది వరకు 3 టైర్ ఏసీ బోగీ, రామేశ్వరం-కన్నియాకుమారి మధ్య నడిపే సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌కు ఆగస్టు 1 నుంచి నుంచి సెప్టెంబరు 29వ తేది వరకు 3 టైర్ ఏసీ బోగీ, నాగర్‌కోయిల్-కోవై మధ్య నడిపే సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌కు ఆగస్టు 1 నుంచి సెప్టెంబరు 29వ తేది వరకు ఒక స్లీపర్ క్లాస్ బోగీ జతచేయనున్నారు.