Share News

ఆన్‌లైన్‌ బెట్టింగ్‌కు బానిసై..

ABN , Publish Date - May 12 , 2026 | 02:04 AM

తాము పడిన కష్టం పిల్లలు పడకూడదని అనుకున్నారు. కష్టపడి.. రూపాయి రూపాయి కూడబెట్టి ఇంజనీరింగ్‌లో చేర్పించారు. ఊర్లో ఉంటే జులాయిలతో చేరి చెడిపోతాడన్న భయంతో కొడుకును తిరుపతిలో పెట్టి చదివించారు. ఆ తల్లిదండ్రుల కలలను కల్లలు చేస్తూ.. అతడు ఆన్‌లైన్‌ బెట్టింగ్‌కు అలవాటు పడ్డాడు. చెడుమార్గాల్లో వెళ్లాడు. ఫలితం ఇంజనీరింగ్‌ విద్యార్థి.. ప్రభుత్వ సచివాలయాల్లో ప్రింటర్లు, ల్యాప్‌టా్‌పలను చోరీచేసే దొంగగా మారాడు.

ఆన్‌లైన్‌ బెట్టింగ్‌కు బానిసై..
స్వాధీనం చేసుకున్న ప్రింటర్లు, ల్యాప్‌టా్‌పను, నిందితుడిని మీడియాకు చూపిసున్న ఎస్పీ తుషార్‌ డూడీ

చోరీలకు పాల్పడిన ఇంజనీరింగ్‌ విద్యార్థి అరెస్టు

రూ.8.10 లక్షల సొత్తు స్వాధీనం

చిత్తూరు అర్బన్‌, మే 11(ఆంధ్రజ్యోతి): తాము పడిన కష్టం పిల్లలు పడకూడదని అనుకున్నారు. కష్టపడి.. రూపాయి రూపాయి కూడబెట్టి ఇంజనీరింగ్‌లో చేర్పించారు. ఊర్లో ఉంటే జులాయిలతో చేరి చెడిపోతాడన్న భయంతో కొడుకును తిరుపతిలో పెట్టి చదివించారు. ఆ తల్లిదండ్రుల కలలను కల్లలు చేస్తూ.. అతడు ఆన్‌లైన్‌ బెట్టింగ్‌కు అలవాటు పడ్డాడు. చెడుమార్గాల్లో వెళ్లాడు. ఫలితం ఇంజనీరింగ్‌ విద్యార్థి.. ప్రభుత్వ సచివాలయాల్లో ప్రింటర్లు, ల్యాప్‌టా్‌పలను చోరీచేసే దొంగగా మారాడు. పోలీసులకు పట్టుబడి కటకటాలపాలయ్యాడు. ఈ వివరాలను సోమవారం ఏఎస్పీలు రాజశేఖర్‌రాజు, తరుణ్‌ పహ్వా, కార్వేటినగరం సీఐ హనుమంతప్పతో కలిసి ఎస్పీ తుషార్‌ డూడీ చిత్తూరులో మీడియాకు వివరించారు. ఆయన తెలిపిన ప్రకారం.. శ్రీరంగరాజపురం మండలం కన్నికాపురానికి చెందిన మహేష్‌ ఇంజనీరింగ్‌ చదవుతున్నాడు. కొన్ని నెలలుగా సచివాలయాల్లోని ప్రింటర్లు, ల్యాప్‌టా్‌పలు చోరీలకు గురవుతున్నాయని జిల్లాతో పాటు తిరుపతి, అన్నమయ్య జిల్లాల్లోనూ ఫిర్యాదులు అందాయి. ఆయా స్టేషన్లలో పోలీసులు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దొంగతనాలు జరిగిన చోట పోలీసులకు ప్రాథమికంగా లభించిన సాంకేతిక ఆధారాలతో మహే్‌షను అదుపులోకి తీసుకున్నారు. అతడినుంచి ప్రింటర్‌ను స్వాధీనం చేసుకున్నారు. చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య జిల్లాల్లోని సచివాలయాల్లో రాత్రి వేళల్లో కట్టర్‌ సాయంతో తలుపులు, తాళాలు పగులగొట్టి ప్రింటర్లు, ల్యాప్‌టా్‌పలు, ఇతర ఎలక్ర్టానిక్‌ వస్తువులను చోరీ చేసేవాడు. దొంగలించిన వస్తువులను ఓఎల్‌ఎక్స్‌ యాప్‌లో తక్కువ ధరలకు పెట్టి వచ్చిన డబ్బులతో ఆన్‌లైన్‌ బెట్టింగ్‌, జల్సాలు చేసినట్టు ఒప్పుకున్నాడు. నిందితుడి నుంచి రూ.8.10 లక్షల విలువైన 30 ప్రింటర్లు, మూడు ల్యాప్‌టా్‌పలు, ద్విచక్రవాహనాన్ని స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించారు. ఈ కేసును ఛేదించడంలో ప్రతిభ కనబరిచిన కార్వేటినగరం సీఐతో పాటు ఎస్‌ఆర్‌పురం ఎస్‌ఐ సుమన్‌, కానిస్టేబుళ్లు లోకనాథం, రాజశేఖర్‌, బాలయ్య, శరత్‌, వజ్రవేలు, యువరాజ్‌ను ఎస్పీ అభినందించారు.

Updated Date - May 12 , 2026 | 02:04 AM