Share News

రాయచోటి ఆర్టీసీ డిపోలో ప్రమాదం

ABN , Publish Date - Nov 24 , 2026 | 12:53 AM

రాయచోటి ఆర్టీసీ డిపోలో సోమవారం జరిగిన ప్రమాదంలో అవుట్‌సోర్సింగ్‌ కార్మికురాలు మృతి చెందింది. మరో ఇద్దరు గాయపడ్డారు.

రాయచోటి ఆర్టీసీ డిపోలో ప్రమాదం
మంత్రి చెందిన భారతి

అవుట్‌సోర్సింగ్‌ కార్మికురాలి మృతి

ఇద్దరికి గాయాలు

రాయచోటి, నవంబరు 23 (ఆంధ్రజ్యోతి): రాయచోటి ఆర్టీసీ డిపోలో సోమవారం జరిగిన ప్రమాదంలో అవుట్‌సోర్సింగ్‌ కార్మికురాలు మృతి చెందింది. మరో ఇద్దరు గాయపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. రాయచోటికి చెందిన భారతి, ఇస్మాయిల్‌, చాకిబండకు చెందిన సుధాకర్‌ స్థానిక ఆర్టీసీ డిపోలో అవుట్‌ సోర్సింగ్‌ కార్మికులుగా పనిచేస్తున్నారు. బస్సు అడుగు భాగంలో క్లీన్‌ చేస్తుండగా మెకానిక్‌ చూసుకోకుండా వాహనాన్ని కదిలించడంతో భారతి మృతిచెందింది. మిగిలిన ఇద్దరికి గాయాలయ్యాయి. వారిని రాయచోటి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఇస్మాయిల్‌ పరిస్థితి విషమంగా ఉండటంతో కడపకు తీసుకెళ్లారు. ఈ ప్రమాదంపై రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి ఆరా తీశారు. భారతి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. గాయపడిన వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్య సిబ్బందిని ఆదేశించారు.

Updated Date - Nov 24 , 2026 | 12:53 AM