నేటినుంచి మున్సిపల్ నామినేషన్ల స్వీకరణ
ABN , Publish Date - Nov 14 , 2026 | 02:12 AM
శ్రీకాళహస్తి మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో శనివారం నుంచి అభ్యర్థుల నామినేషన్ల స్వీకరణ జరగనుంది. పట్టణంలోని 44 వార్డులకు గాను రెండు నామినేషన్ కేంద్రాలను అధికారులు సిద్ధం చేశారు.
శ్రీకాళహస్తి, నవంబరు 13(ఆంధ్రజ్యోతి): శ్రీకాళహస్తి మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో శనివారం నుంచి అభ్యర్థుల నామినేషన్ల స్వీకరణ జరగనుంది. పట్టణంలోని 44 వార్డులకు గాను రెండు నామినేషన్ కేంద్రాలను అధికారులు సిద్ధం చేశారు. స్వర్ణముఖి నదికి తూర్పు వైపున ఉన్న 32 వార్డులకు, చైర్మన్ అభ్యర్థికి మున్సిపల్ కార్యాలయంల నామినేషన్లను దాఖలుచేసేలా ఏర్పాట్లు చేశారు. అలాగే స్వర్ణముఖి నద అవలి వైపు ఉన్న 33 నుంచి 44 వార్డు 12 వార్డులకు గాను ఆర్డీవో కార్యాలయం ప్రాంగణంలో నామినేషన్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3గంటల లోగా అభ్యర్థులు తమ నామినేషన్లు దాఖలు చేసేలా సమయపాలన విధించారు. శని, ఆది, సోమవారం మధ్యాహ్నం 3గంటల వరకు నామినేషన్ల స్వీకరణ ఉంటుంది. 17 నామినేషన్ల పరశీలన, 19న నామినేషన్ల ఉపసంహరణ అదే రోజు సాయంత్రం 3గంటలకు బరిలో ఉన్న అభ్యర్థుల తుది జాబితా వెల్లడించనున్నట్ల కమిషనర్ కేవీ కృష్ణారెడ్డి తెలిపారు.