24 గంటలపాటు ఆర్డీవో కార్యాలయంలో ఏసీబీ సోదాలు
ABN , Publish Date - Mar 02 , 2026 | 01:35 AM
సూళ్లూరుపేట ఆర్డీవో కార్యాలయంలో ఏసీబీ సోదాలు ఆదివారం మధ్నాహ్నం మూడు గంటల వరకు కొనసాగాయి. శనివారం ఏసీసీ దాడులు చేసి రైతు నుంచి రూ.40వేల లంచం తీసుకుంటూ ఆర్డీవో కార్యాలయంలో పనిచేసే సీనియర్ అసిస్టెంట్ సిరాజ్, సీసీ హేమంత్, బైక్ మెకానిక్ వెంకటసుబ్బయ్య ఏసీబీకి చిక్కిన విషయం తెలిసిందే. ఏసీబీ ఏఎస్పీ విమలకుమారి, ఇన్‌చార్జి డీఎస్పీ ప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో శనివారం అర్ధరాత్రి వరకు కూడా ఆర్డీవో కార్యాలయంలో పలు రికార్డులను స్వాధీనం చేసుకుని కార్యాలయ సిబ్బందిని విచారించారు. తర్వాత ఏసీబీకి చిక్కిన ఉద్యోగుల ఇళ్లలోనూ సోదాలు చేసి.. కుటుంబ సభ్యులను కూడా విచారించినట్లు తెలిసింది. ఆర్డీవో కార్యాలయంలో ఏడాదిగా భూములకు సంబంధించిన రికార్డు పనులు పెండింగ్‌లో ఉన్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. ఈ భూములకు సంబంధించిన రైతులను కొంతమందిని రప్పించి వివరాలు సేకరించినట్లు సమాచారం.
సూళ్లూరుపేట, మార్చి 1 (ఆంధ్రజ్యోతి): సూళ్లూరుపేట ఆర్డీవో కార్యాలయంలో ఏసీబీ సోదాలు ఆదివారం మధ్నాహ్నం మూడు గంటల వరకు కొనసాగాయి. శనివారం ఏసీసీ దాడులు చేసి రైతు నుంచి రూ.40వేల లంచం తీసుకుంటూ ఆర్డీవో కార్యాలయంలో పనిచేసే సీనియర్ అసిస్టెంట్ సిరాజ్, సీసీ హేమంత్, బైక్ మెకానిక్ వెంకటసుబ్బయ్య ఏసీబీకి చిక్కిన విషయం తెలిసిందే. ఏసీబీ ఏఎస్పీ విమలకుమారి, ఇన్‌చార్జి డీఎస్పీ ప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో శనివారం అర్ధరాత్రి వరకు కూడా ఆర్డీవో కార్యాలయంలో పలు రికార్డులను స్వాధీనం చేసుకుని కార్యాలయ సిబ్బందిని విచారించారు. తర్వాత ఏసీబీకి చిక్కిన ఉద్యోగుల ఇళ్లలోనూ సోదాలు చేసి.. కుటుంబ సభ్యులను కూడా విచారించినట్లు తెలిసింది. ఆర్డీవో కార్యాలయంలో ఏడాదిగా భూములకు సంబంధించిన రికార్డు పనులు పెండింగ్‌లో ఉన్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. ఈ భూములకు సంబంధించిన రైతులను కొంతమందిని రప్పించి వివరాలు సేకరించినట్లు సమాచారం. శనివారం మధ్యాహ్నం నుంచి ఆదివారం మధ్యాహ్నం వరకు దాదాపు 24 గంటల వరకు ఆర్డీవో కార్యాలయాన్ని ఏసీబీ అధికారులు తమ ఆధీనంలోకి తీసుకుని సోదాలు చేసింది.