విధుల్లో చేరిన అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్లు
ABN , Publish Date - Sep 02 , 2026 | 01:30 AM
జిల్లా విద్యాశాఖ బలోపేతంలో భాగంగా అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్లు మంగళవారం విధుల్లో చేరారు. మొత్తం 249 పోస్టులు మంజూరు చేయగా.. 569 మంది దరఖాస్తు చేసుకున్నారు. 156 సెకండరీ గ్రేడ్ టీచర్లు (ఎస్‌జీటీ) పోస్టులకు 419.. 93 స్కూల్ అసిస్టెంట్ (ఎస్‌ఏ) పోస్టులకు 150 దరఖాస్తులు వచ్చాయి. దరఖాస్తులను ఐదుగురు సభ్యుల కమిటీ మెరిట్ ఆధారంగా ఎంపిక చేసింది.
చేరని 15 మంది స్థానంలో మెరిట్ లిస్టులోని తదుపరి అభ్యర్థులకు అవకాశం
చిత్తూరు సెంట్రల్, సెప్టెంబరు 1 (ఆంధ్రజ్యోతి): జిల్లా విద్యాశాఖ బలోపేతంలో భాగంగా అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్లు మంగళవారం విధుల్లో చేరారు. మొత్తం 249 పోస్టులు మంజూరు చేయగా.. 569 మంది దరఖాస్తు చేసుకున్నారు. 156 సెకండరీ గ్రేడ్ టీచర్లు (ఎస్‌జీటీ) పోస్టులకు 419.. 93 స్కూల్ అసిస్టెంట్ (ఎస్‌ఏ) పోస్టులకు 150 దరఖాస్తులు వచ్చాయి. దరఖాస్తులను ఐదుగురు సభ్యుల కమిటీ మెరిట్ ఆధారంగా ఎంపిక చేసింది. ఈ జాబితాను డీఈవో లక్ష్మీనారాయణ కలెక్టర్ ఆమోదంతో మండలాలకు పంపారు. ఎంపికైన అభ్యర్థులకు ఎంఈవోలు నియామక ఉత్తర్వులు ఇచ్చారు. దీంతో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్లు మంగళవారం విధుల్లో చేరారు. తమకు అనుకూలమైన పాఠశాల రాలేదని, ఇతర కారణాలతో 15 మంది విధుల్లో చేరలేదు. వీరి స్ధానంలో మెరిట్ లిస్టులోని తదుపరి అభ్యర్థులకు అవకాశం కల్పిస్తున్నట్లు డీఈవో తెలిపారు. జిల్లాలో టీచర్ల కొరత తీర్చడానికి మరో 115 అదనంగా కావాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. వీటికి ఆమోదం రాగానే ఈ పోస్టులను కేవలం కుప్పం నియోజకవర్గంలోనే భర్తీ చేయనున్నారు.