అక్షయ తృతీయ ఆఫర్ల పేరుతో మహిళకు టోకరా
ABN , Publish Date - Apr 17 , 2026 | 12:40 AM
అక్షయ తృతీయ ఆఫర్ల పేరుతో ఓ మహిళను నమ్మించి రూ.1.07లక్షలు కాజేశాడో వ్యక్తి. ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది.
‘తని్‌ష్క’లో పనిచేస్తున్నానంటూ
రూ.1.07 లక్షలు కాజేశాడు
తిరుపతి(నేరవిభాగం), ఏప్రిల్ 16 (ఆంధ్రజ్యోతి): అక్షయ తృతీయ ఆఫర్ల పేరుతో ఓ మహిళను నమ్మించి రూ.1.07లక్షలు కాజేశాడో వ్యక్తి. ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. తిరుపతి అలిపిరి సీఐ రామకిషోర్ తెలిపిన వివరాల ప్రకారం.. తిరుపతి శాంతినగర్‌కు చెందిన సంధ్యకు ఈనెల 10వ తేదీన నిఖిల్ అనే వ్యక్తి ఫోన్ చేసి.. తాను ఎయిర్ బైపాస్ రోడ్డులోని తనిష్క్ గోల్డ్ షోరూమ్ నుంచి మాట్లాడుతున్నానని చెప్పాడు. అక్షయ తృతీయ సందర్భంగా గోల్డ్ కాయిన్స్‌పై ప్రత్యేక ఆఫర్లు ఉన్నాయని, తక్కువ ధరకే లభిస్తాయని నమ్మించాడు. ఆఫర్ పొందాలంటే ముందుగా రూ.7వేలను అడ్వాన్స్‌గా చెల్లించాలని చెప్పాడు. ఆశపడిన సంధ్య ఆ మొత్తాన్ని ఆన్‌లైన్ ద్వారా పంపించింది. తిరిగి ఈనెల 13వ తేదీన ఫోన్ చేసిన నిఖిల్.. గోల్డ్ కాయిన్లు సిద్ధంగా ఉన్నాయని, మిగిలిన నగదు చెల్లించాలంటూ రెండు క్యూఆర్ కోడ్‌లు పంపాడు. వాటి ద్వారా మరో రూ.లక్షను ఆమె చెల్లించారు. అనంతరం బంగారు కాయిన్ల కోసం తనిష్క్ షోరూమ్‌కు వెళ్లగా, తమ వద్ద అలాంటి ఆఫర్లు ఏవీ లేవని యాజమాన్యం స్పష్టం చేసింది. మోసపోయానని గ్రహించిన బాధితురాలు నిఖిల్‌కు ఫోన్ చేయగా అతడి మొబైల్ స్విచ్‌ఆ్‌ఫ వచ్చింది. దీనిపై సైబర్ క్రైమ్ పోర్టల్‌లో ఫిర్యాదు చేసింది. గురువారం అలిపిరి పోలీసులకూ ఫిర్యాదు చేయగా కేసు నమోదుచేశారు. కాగా, నిఖిల్ పేరుతో ఓ వ్యక్తి ఐదేళ్లుగా తనిష్క్ షోరూమ్‌లో పనిచేస్తున్నట్టు ప్రాథమిక విచారణలో తేలిందని సీఐ వెల్లడించారు.