నమ్మకం కలిగేలా పరిష్కారం
ABN , Publish Date - Jun 20 , 2026 | 02:25 AM
ప్రజలకు నమ్మకం కలిగేలా సమస్యలు పరిష్కరించాలని కలెక్టర్ నిశాంత్‌కుమార్ అధికారులను ఆదేశించారు. ఒక నియోజకవర్గం.. ఒక మండలం.. నాలుగు సందర్శనలు కార్యక్రమంలో భాగంగా శుక్రవారం ఆయన రాయచోటి ఆర్డీవో కార్యాలయంలో ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు.
కలెక్టర్ నిశాంత్ కుమార్
రాయచోటి రూరల్, జూన్ 19 (ఆంధ్రజ్యోతి): ప్రజలకు నమ్మకం కలిగేలా సమస్యలు పరిష్కరించాలని కలెక్టర్ నిశాంత్‌కుమార్ అధికారులను ఆదేశించారు. ఒక నియోజకవర్గం.. ఒక మండలం.. నాలుగు సందర్శనలు కార్యక్రమంలో భాగంగా శుక్రవారం ఆయన రాయచోటి ఆర్డీవో కార్యాలయంలో ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. రాయచోటి నుంచి 10, రామాపురం 4, గాలివీడు 3, లక్కిరెడ్డిపల్లె, చిన్నమండ్యెం, సంబేపల్లె నుంచి ఒక్కొక్క అర్జీలు వచ్చాయి. కాగా గత వారం వచ్చిన అర్జీలకు సంబంధించి అధికారులు తీసుకున్న చర్యలపై ఆరా తీశారు. న్యాయం జరిగిందా లేదా అని అర్జీదారులను అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం వచ్చిన అర్జీలను వచ్చే శుక్రవారం నాటికి పరిష్కరించాలని కలెక్టర్ ఆదేశించారు. కార్యక్రమంలో రాయచోటి తహసీల్దార్ యామిని, డిప్యూటీ తహసీల్దార్ వంశీధర్‌రెడ్డి, ఆర్‌ఐ దినేశ్, వీఆర్‌వోలు పాల్గొన్నారు.