Share News

భక్త జనసంద్రం ముక్కంటి ఆలయం

ABN , Publish Date - Aug 10 , 2026 | 01:52 AM

శ్రీకాళహస్తీశ్వరాలయం ఆదివారం భక్తజన సంద్రంగా మారింది. వరుస సెలవులు కావడంతో రెండు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా దేశ నలుమూలల నుంచి అధిక సంఖ్యలో స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు.

భక్త జనసంద్రం ముక్కంటి ఆలయం
క్యూలో వెళుతున్న భక్తులు

శ్రీకాళహస్తి, ఆగస్టు 9 (ఆంధ్రజ్యోతి): శ్రీకాళహస్తీశ్వరాలయం ఆదివారం భక్తజన సంద్రంగా మారింది. వరుస సెలవులు కావడంతో రెండు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా దేశ నలుమూలల నుంచి అధిక సంఖ్యలో స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. సుమారు 36వేలమంది దర్శించుకున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. రూ.500 అంతరాలయ దర్శనం ద్వారా 547మంది, రూ.200 శీఘ్ర దర్శనం టిక్కెట్ల ద్వారా 3,153మంది, రూ.50ప్రత్యేక దర్శనం టిక్కెట్ల ద్వారా 2,351మంది దర్శించుకున్నారు. రూ.500 రాహుకేతు టిక్కెట్ల ద్వారా 3,051మంది, రూ.750 టిక్కెట్ల ద్వారా1,220మంది, రూ.1,500 టిక్కెట్ల ద్వారా 433మంది, రూ.2,500 టిక్కెట్ల ద్వారా 308మంది, రూ.5వేల టిక్కెట్ల ద్వారా 107మంది భక్తులు పూజలు చేయించుకున్నారు. ఐదు రకాల ప్రసాదాలు కలిపి 26,531 అమ్ముడైనట్లు ఆలయ అధికారులు తెలిపారు.

Updated Date - Aug 10 , 2026 | 01:52 AM