Share News

కాణిపాకానికి కొత్త బస్సొచ్చింది

ABN , Publish Date - Feb 21 , 2026 | 12:21 AM

న్యూటన్‌ ఎలక్ట్రిక్‌ ఏసీ బస్సు తొలిసారి తిరుపతి-కాణిపాకం మధ్య రెండు ట్రిప్పులు నడిచింది.

కాణిపాకానికి కొత్త బస్సొచ్చింది

తిరుపతి(ఆర్టీసీ), ఫిబ్రవరి 20(ఆంధ్రజ్యోతి): న్యూటన్‌ ఎలక్ట్రిక్‌ ఏసీ బస్సు తొలిసారిగా ప్రయాణికులను ఎక్కించుకొని తిరుపతి-కాణిపాకం మధ్య రెండు ట్రిప్పులు నడిచింది. పుణెలోని న్యూటన్‌ సంస్థలో తయారైన ఈ బస్సు రెండు వారాల కిందట తిరుపతికి చేరుకుంది. ఆర్టీసీ అధికారుల అనుమతితో న్యూటన్‌ సంస్థ ప్రతినిధులు ఈనెల 11న తిరుపతి-కాణిపాకం మధ్య ట్రయల్స్‌ ప్రారంభించి పదిరోజుల పాటు నడిపారు. అధికారులు నిర్దేశించిన పదిరోజుల్లో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ట్రయల్‌ విజయవంతమైంది. ఈ నేపథ్యంలో అదే రూట్‌లో శుక్రవారం ఉదయం ఆరు గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 2.30గంటలకు రెండు ట్రిప్పులు పూర్తి చేసుకుంది. ప్రయాణికుల పూర్తిసామర్థ్యంలో బస్సు నడిచినా ఎలాంటి సమస్యలు ఎదురుకాలేదు. ప్రయాణికులు కూడా సంతృప్తి వ్యక్తం చేశారు. ఇలా పదిరోజులపాటు ప్రయాణికులతో నడవనుంది. ఆ తర్వాత తిరుపతి-శ్రీకాళహస్తి, తిరుపతి-తిరుమల మధ్య పదిరోజుల చొప్పున ప్రయోగాత్మకంగా తిప్పనున్నారు.

Updated Date - Feb 21 , 2026 | 12:21 AM